Home

»

Latest News

రేపు సెన్సారు కానున్నయన్ టి ఆర్ "శక్తి"

Mar 23, 2011 3:07PM

ntr wallpapers, ntr stills, ntr images, ntr pics, ntr photos, ntr pictures రేపు సెన్సారు కానున్నయన్ టి ఆర్ "శక్తి". వివరాల్లోకి వెళితే వైజయంతీ మూవీస్ పతాకంపై, యన్‍ టి ఆర్‍ హీరోగా, ఇలియానా, మంజరి ఫడ్నిస్ హీరోయిన్లుగా, మెహెర్ రమేష్ దర్శకత్వంలో, అత్యంత భారీ బడ్జెట్ తో అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం"శక్తి". ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతం ఇటీవలే విడుదలై, చక్కని ప్రేక్షకాదరణ పొందుతూంది. ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం రేపు అంటే మార్చ్24 వ తేదీన సెన్సారుకి వెళ్ళనుంది.

ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రానికి సెన్సారు వారు "ఎ"సర్టిఫికేట్ ఇస్తారో..., లేక "యు" సర్టిఫికేట్ ఇస్తారో....లేక "యు/ఎ" సర్టిఫికేట్ ఇస్తారో రేపు ఈ యన్ టి ఆర్ "శక్తి" చిత్రం సెన్సారు పూర్తయ్యాక కానీ తెలియదు. ఈ చిత్రమ శక్తి పీఠాలకు సంబంధించిన కథతో నిర్మించబడిందన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ చిత్రం మీద అటు యన్ టి ఆర్ అభిమానుల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com