Home

»

Latest News

"మంత్రిగారి వియ్యంకుడు" రీమేక్ లో రవితేజ

Mar 23, 2011 5:10PM

ravi teja wallpapers, ravi teja stills, ravi teja pics, ravi teja photos, ravi teja pictures, ravi teja imag"మంత్రిగారి వియ్యంకుడు" రీమేక్ లో రవితేజ హీరోగా నటించనున్నాడట. గతంలో గ్రేట్ క్రియేటర్ బాపు దర్శకత్వంలో, ముళ్ళపూడి వెంకటరమణ సంభాషణలు వ్రాయగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా, పూర్ణమా జయరాం హీరోయిన్ గా, జయకృష్ణ నిర్మించిన సూపర్ హిట్ విభిన్నకథా చిత్రం "మంత్రిగారి వియ్యంకుడు". ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలనే ఆలోచన బాపు-రమణ గార్లకు వచ్చిందట. ముళ్ళపూడి వెంకటరమణ గారి కొడుకు వర ముళ్ళపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చెయ్యాలనుకున్నారట.

అయితే ఈ చిత్రంలో హీరోగా ఎవరు నటిస్తారా అనుకున్నప్పుడు రవితేజ తాను నటిస్తానని అన్నారట. కానీ ముళ్ళపూడి వెంకట రమణ గారు స్వర్గస్తులవటం వల్ల ఈ సినిమా ఆలస్యమయ్యిందని సమాచారం. ప్రస్తుతం ఈ "మంత్రిగారి వియ్యంకుడు"చిత్రం రీమేక్ త్వరలో సెట్స్ మీదకు రానుందనీ, గతంలో "సారాయి వీర్రాజు" చిత్రాన్ని నిర్మించిన నిర్మాతే ఈ "మంత్రిగారి వియ్యంకుడు" రీమేక్ చిత్రాన్ని కూడా నిర్మిస్తారని తెలిసింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com