Home

»

Latest News

యూత్ మూవీ పేరిట స్కూల్ పిల్లల మధ్య ప్రేమ, రొమాన్స్: మేకర్స్ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?

Oct 3, 2026 12:17PM

సినిమా.. అంటే ఏంటి? ప్రేక్షకుడికి ఉన్న టెన్షన్ మొత్తాన్ని పోగొట్టి సరికొత్త లోకంలో విహరించేలా చేసే రెక్కల గుర్రం లాంటిది. మెసేజ్ తో పాటు జీవితంలో  ఎలా బతకాలో, బయట ఎలాంటి మనుషులు ఉంటారో కూడా చెప్తు సినీ కళామతల్లికి శతకోటి వందనాలు అనేలా కూడా చేస్తుంది. అలాంటి గొప్ప సినీ పరిశ్రమ  కొంత మంది వల్ల  విమర్శలని ఎదుర్కొంటు తలదించుకోవాల్సిన పరిస్థితి.  

ఇటీవలి కాలంలో టాలీవుడ్ తో పాటు భారతీయ సినిమా పరిశ్రమలో ‘యూత్ ఫుల్ ఎంటర్టైనర్’ అండ్ ‘టీనేజ్ లవ్ స్టోరీ’ పేరిట వస్తున్న సినిమాలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. 14, 15, 16 ఏళ్ల వయస్సున్న బడిపిల్లల మధ్య ప్రేమ, ముద్దులు, రొమాన్స్, మోహం వంటి భావోద్వేగాలను ప్రధాన వస్తువుగా చేసుకుని సినిమాలు చేస్తున్నారు. ఒక రకంగా ఎవరు ఎలాంటి వారో తెలుసుకోలేని పరిణితి చెందని వయసుని రెచ్చగొడుతున్నట్టే లెక్క. అసలు ఒకప్పుడు బడిపిల్లలు లేదా కాలేజీ యూత్ కథలు అంటే స్నేహం, చదువు, క్రీడలు, బాధ్యతలు, జీవితంలో గెలవాలనే తపన లేదా స్వచ్ఛమైన ఆకర్షణ చుట్టూ తిరిగేవి. కానీ నేడు సినిమా అంటే కేవలం రొమాన్స్, సెక్స్, శారీరక ఆకర్షణ మాత్రమేనా అన్న అనుమానం ప్రతి సగటు ప్రేక్షకుడికి కలుగుతోంది.

తాజా గణాంకాల ప్రకారం భారతీయ సినీ పరిశ్రమలో గత మూడేళ్లలో విడుదలైన టీనేజ్ డ్రామా సినిమాల్లో దాదాపు 70 శాతానికి పైగా చిత్రాలు తీవ్రమైన శారీరక ఆకర్షణ, ముద్దులు మరియు వయస్సుకు మించిన శృంగార దృశ్యాల చుట్టూనే నిర్మించబడ్డాయి. ఈ తరహా కంటెంట్ కారణంగా 13 నుండి 18 ఏళ్ల వయస్సు గల కౌమారదశలో ఉన్న పిల్లలపై తీవ్రమైన మానసిక ప్రభావం పడుతోందని చైల్డ్ సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. సర్వేల ప్రకారం రోజూ సోషల్ మీడియా లేదా సినిమాల్లో ఇటువంటి కంటెంట్ చూసే పిల్లల్లో 45 శాతానికి పైగా చదువుపై ఏకాగ్రత కోల్పోవడం, వయసుకి   మించిన ప్రవర్తనని  అలవర్చుకోవడం వంటి సమస్యలని ఎదుర్కొంటున్నారు.

స్కూల్ వయస్సు అంటే భవిష్యత్తుకు పునాది వేసుకునే సమయం. ఆ వయసులో ఉండే కౌమార భావోద్వేగాలను చాలా సున్నితంగా, బాధ్యతాయుతంగా తెరపై చూపించాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది సినీ మేకర్స్ బాక్సాఫీస్ కలెక్షన్లు, గ్లామర్, కాంట్రవర్సీల కోసం టీనేజ్ లైఫ్ అంటే కేవలం రొమాన్స్ మాత్రమే అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. సినిమా అనేది సమాజంపై, ముఖ్యంగా లేత మనస్సులపై ఎంతటి ముద్ర వేస్తుందో మనందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు పాఠశాల స్థాయి పిల్లల మధ్య శారీరక సాన్నిహిత్యాన్ని, రొమాన్స్‌ని వైభవంగా చూపించడం వల్ల పిల్లలు నిజ జీవితంలో కూడా అదే నిజమని నమ్మే ప్రమాదం ఉందనేది ఫ్యామిలీ ఆడియన్స్ ఆవేదన.

కాబట్టి సినిమా మేకర్స్ ఒక్కసారి ఆలోచించాలి. స్కూల్, కాలేజీ వయస్సు పిల్లల జీవితాల్లో చెప్పడానికి ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. వారిలోని సృజనాత్మకత, స్నేహబంధం, లక్ష్యాల సాధన, ఎదుర్కొనే మానసిక ఒత్తిళ్లు, వాటిని అధిగమించే మార్గాలు వంటి అంశాలపై సినిమాలు తీస్తే అవి ఎంతోమందికి స్పూర్తినిస్తాయి. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్కును చేరుకోవడానికే ప్రాధాన్యత ఇస్తూ, భావితరాల మనస్సులను చెడగొట్టే రొమాంటిక్ సీన్లను రుద్దడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో సెన్సార్ బోర్డ్ కూడా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇది కూడా చదవండి: తెల్ల కాగితం' ఫస్ట్ డే కలెక్షన్లు ఇవేనా! కోర్ట్ మ్యాజిక్ కంటిన్యూ అవుతుందా!

సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, అది సమాజానికి అద్దం పడుతుంది. రొమాన్స్, సెక్స్ పేరిట టీనేజర్ల అమాయకత్వాన్ని వ్యాపార సరుకుగా మార్చకుండా, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందిస్తేనే చిత్రసీమకు, సమాజానికి మంచిది. తల్లిదండ్రులు, సినీ ప్రేమికులు, సమాజ హితాన్ని కోరే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇదే విషయాన్ని ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. లేదంటే ముందు ముందు కరుడుగట్టిన సినీ ప్రేమికులు సైతం యూత్ సినిమా పేరిట స్కూల్ పిల్లల మధ్య రొమాన్స్ ని బేస్ చేసుకొని సినిమాలు తీస్తే మేకర్స్  ఇంటి ముందు నిరాహారదీక్ష చెయ్యాల్సి వస్తుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్చ్ చేస్తున్నారు.. సో.. సినిమాకి ఉన్న గొప్ప పేరుని నాశనం చేయకండి.

 

[School Kids Romance In Youth Movies, Teenage love Stories, school romance in movies, youthful cinema impact, censorship in movies, youth movies trend, Telugu Cinema News, Tollywood, Tollywood News, Telugu Cinema]
 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com