Home

»

Latest News

రావు బహదూర్.. మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా!

Jul 1, 2026 5:39PM

సూపర్‌స్టార్ మహేష్ బాబు జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ 'రావు బహదూర్'. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి & శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ‘రావు బహదూర్’ చిత్రం జూలై 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ మీడియాతో ముచ్చటించి సినిమా విశేషాలు పంచుకున్నారు.

'రావు బహదూర్'పై మీ టీమ్ అందరూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు... కారణం?
సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకం ఇది. మేము సినిమా మొదలుపెట్టినప్పుడు "మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా" అనే ట్యాగ్‌లైన్‌ను అనుకున్నాము. మహేష్ బాబు గారు ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ట్యాగ్‌లైన్ చెప్పారు. ఇప్పటివరకు సినిమా చూసిన ఫిలిం మేకర్స్ కూడా "మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా" అని చెబుతున్నారు. ఇదంతా మాకు సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకమే.

రావు బహదూర్ జానర్ ఏమిటి?
ఇది కంప్లీట్ సైకాలజికల్ డ్రామా. మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌జానర్స్‌గా ఉంటాయి. ఏదైనా మెటాఫర్‌ను విజువల్‌గా చేసి చూపించడం మ్యాజికల్ రియలిజం. కాకపోతే, కొన్నిసార్లు ఇది హారర్‌లా అనిపించవచ్చు.  టీజర్‌లో మీరు వేర్లు వెంటాడుతున్న విజువల్ ఒకటి చూసి ఉంటారు. మీరు థియేటర్‌లో చూస్తున్నప్పుడు అది ప్రేక్షకులకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది.

ఈ కథ అనుకున్నప్పుడే మీ క్యారెక్టర్ మేకప్ ఇంత ఛాలెంజింగ్‌గా ఉంటుందని అనుకున్నారా?
-మనం మామూలుగా చేసే సినిమాల కంటే 300 శాతం ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడాలని తెలుసు. అలాగే ఇది హెవీ మేకప్ సినిమా అని కూడా తెలుసు. 

-కమల్ హాసన్ గారు, సూర్య గారు, విక్రమ్ గారు ఇలాంటి హెవీ మేకప్ సినిమాలు ప్రయత్నిస్తుంటారు. అది చూస్తున్నప్పుడు నేను కూడా ఎప్పుడైనా అలాంటి సినిమా చేయాలని అనుకునేవాడిని. నేను యాక్టర్ అయినప్పటి నుంచి అది నా డ్రీమ్. ఆ అవకాశం 'రావు బహదూర్'తో వచ్చింది.

-మనం కోరుకున్నది మనకు వచ్చినప్పుడు కచ్చితంగా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సినిమాకు మేకప్ కంటే మైండ్ మేకప్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు అలాంటి మైండ్ మేకప్ చాలా చేశాను. ప్రతిరోజూ వెళ్లి 16 గంటలు పని చేయాలని ముందే నిర్ణయించుకునేవాడిని. అలా ప్రతిరోజూ హ్యాపీగా వెళ్లి ఎంజాయ్ చేస్తూ చేశాను. 

-ఇందులో నా క్యారెక్టర్‌కు మేకప్ వేయడానికి ఐదు గంటలు పట్టేది, తీయడానికి గంటన్నర పట్టేది. ఇలాంటి పాత్రలు చేయడానికి చాలా సహనం కావాలి. ఈ సినిమా చేసిన తర్వాత నాకు కూడా చాలా సహనం ఉందని అర్థమైంది (నవ్వుతూ).

ఇది మీ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా?
-అవును. మొన్నటి వరకు నా కెరీర్‌లో 'జ్యోతిలక్ష్మి'కి ముందు, తర్వాత అని చూసుకునేవాడిని. ఇప్పుడు 'రావు బహదూర్'కి ముందు, రావు బహదూర్‌కి తర్వాత అన్నట్టుగా చూస్తారని నమ్ముతున్నాను.

రావు బహదూర్‌లో రామప్ప క్యారెక్టర్‌కు ఉన్న రిఫరెన్స్ ఏంటి?
-నిజానికి రావు బహదూర్‌లో రామప్ప క్యారెక్టర్‌కు ఎలాంటి రిఫరెన్స్ లేదు. రామప్ప వెరీ మ్యాడ్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత రామప్పలా చేయాలి అని ఒక రిఫరెన్స్ పాయింట్ ఏర్పడుతుంది.

-ఈ సినిమా చేస్తున్నప్పుడు రామప్ప క్యారెక్టర్ నన్ను ఆవహించాడేమో అన్నట్టుగా అనిపించింది. అంతలా ఆ పాత్రలో లీనమైపోయాను.

-ఈ సినిమాలో ప్రతి సన్నివేశంలో చాలా రిచ్ రైటింగ్, డీటైలింగ్ ఉంటుంది. వెంకటేష్ మహా ప్రతి లేయర్‌ను చాలా అద్భుతంగా రాసుకున్నారు. అంతే అద్భుతంగా తీశారు. సినిమా రిపీట్‌గా చూసేలా ఉంటుంది.

ఇది ఏ టైం పీరియడ్ సినిమా?
-1960–99 మధ్య జరిగే కథ. ఇందులో కథానాయకుడు దేశసంచారి. తను అలా సంచారం చేస్తూ మళ్లీ తన ప్యాలెస్ భువనాలయంకి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరం.

ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయా?
-యాక్షన్ సీక్వెన్స్‌లు లేవు గానీ, యాక్టింగ్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. ఒక పాట కంప్లీట్‌గా రోప్‌పై ఉంటుంది. ఇందులో రిలీజ్ అయిన వాటితో పాటు ఇంకా మూడు పాటలు ఉన్నాయి. అందులో రెండు డాన్స్ నంబర్స్. నా కెరీర్ లో ఫస్ట్ టైం ఇంతాలా డ్యాన్స్ చేసిన సినిమా ఇదే. ఈ సినిమా కోసం సాల్సా కూడా నేర్చుకున్నాను. 

ఈ సినిమా కోసం మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్ ఏమిటి?
-ఫిజికల్‌గా కొన్ని ఛాలెంజ్‌లు ఉన్నాయి. కానీ మెంటల్‌గా నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎందుకంటే సినిమా అంటే నాకు ఇష్టం. యాక్టర్‌గా  దీన్ని నేను ఒక వర్క్‌లా చూడను. ప్రతిరోజూ నాకు నచ్చిన పని చేశాననే ఆనందం ఉంటుంది.

-ఆడియన్స్‌గా నన్ను నేను చూసుకుంటాను. నా నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎందుకు ఎదురు చూడాలి అనే ప్రశ్నను నాకు నేనే వేసుకుంటాను.

మహేష్ బాబు గారు సినిమా చూసి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు?
-మహేష్ బాబు గారు, నమ్రత గారు కలిసి ఈ సినిమా చూశారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆయన టీజర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. అలాగే సుకుమార్ గారు కూడా చూశారు. ఆయన కూడా మంచి రివ్యూ ఇచ్చారు. అందరూ కూడా "మునుపెన్నడూ చూడని తెలుగు సినిమా" అని చెప్పారు.  ఎందుకు అలా చెప్పారో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది.

మహేష్ బాబు గారితో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేశాను. కాకపోతే అందులో నా సీన్ కట్ అయింది. అలాంటి మహేష్ బాబు గారు నా సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తూ "సత్యదేవ్ ఇన్..." అని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది. మహేష్ బాబు గారు ఇచ్చిన వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది.

-కొత్త రకం సినిమాలు తమిళం, మలయాళం నుంచి వచ్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. మన దగ్గర ఎందుకు ఇలాంటి కొత్త రకం సినిమాలు లేవని ఒక డిస్కషన్ నడుస్తుంటుంది. అలాంటి వారందరికీ ఈ సినిమా ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.

తెలుగులో సైకాలజికల్ డ్రామాలు ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని అనుకుంటున్నారు?
-ఇందులో అసలు కథ యూనివర్సల్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే, అందరికీ ఈజీగా అర్థమయ్యే కథ. అది నేను ఇప్పుడే రివీల్ చేయలేను. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు "ఇందుకు ఇలా అయిపోయాడు?" అని ఆ క్యారెక్టర్‌తో ఈజీగా ట్రావెల్ అవుతారు.

నెక్స్ట్ సినిమాలు?
'సమవర్తి' ఇప్పటివరకు నేను చేయని సినిమా. అది ఒక ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఒక కామెడీ సినిమా కూడా చేస్తున్నాను. అలాగే 'ఫుల్ బాటిల్' లో మాస్ క్యారెక్టర్ కూడా చేస్తున్నాను.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com