
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి పని చెయ్యాలని ఎవరకి ఉండదు చెప్పండి. ఉంటుంది కదా!. అందుకే అభిమానులు, సినిమాల్లో తనతో కలిసి పని చెయ్యాలని కలలు కనే వాళ్ళ కలలని నిజం చేస్తూ, సరికొత్త సంచలనానికి తెరలేపారు పవన్ కళ్యాణ్. ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' (PKCW) తాజాగా ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమిస్తూ సరికొత్త ప్రకటన చేసింది. చలనచిత్ర రంగంలో అపారమైన సృజనాత్మకత కలిగిన ప్రతిభావంతులను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే సంకల్పంతో "గ్లోబల్ సినిమా టాలెంట్ కమ్యూనిటీ" (Global Cinema Talent Community) అనే గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌ను అధికారికంగా ప్రారంభించింది. టాలీవుడ్ చరిత్రలోనే ఇదొక విప్లవాత్మకమైన అడుగు అని పరిశ్రమ వర్గాలు కొనియాడుతున్నాయి.
మీలో మంచి నటుడు ఉన్నా, సరికొత్త కథలు రాయగల రచయిత దాగున్నా, లేదా అద్భుతమైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నా ఇకపై అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ప్రారంభించిన ఈ గ్లోబల్ కమ్యూనిటీ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మీలోని క్రియేటివిటీని నేరుగా పీకేసీడబ్ల్యూ బృందానికి చూపించవచ్చు. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో పవన్ కళ్యాణ్ నిర్మించే రాబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో భాగస్వామ్యమయ్యే సువర్ణావకాశాన్ని ఈ వేదిక కల్పిస్తోంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడమే కాకుండా, నవతరం ఆలోచనలకు ఒక గ్లోబల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం ఈ గ్లోబల్ సినిమా టాలెంట్ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం.
Also read: సంపాదన లేదని అల్లుడిని అత్తగారు ఎలా అవమానిస్తుందో
ఈ సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తమ భవిష్యత్తు ప్రాజెక్టులపై కూడా అభిమానులకి ప్రేక్షకులకు స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సినిమా రంగానికి కూడా పూర్తి న్యాయం చేస్తారని స్పష్టం చేసింది. ఇప్పటికే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి భారీ చిత్రాల నిర్మాణ చర్చలు చివరి దశకి చేరుకున్నాయి.
సినిమా రంగంపై ఆసక్తి ఉండి, సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ గ్లోబల్ సినిమా టాలెంట్ కమ్యూనిటీ ఒక గొప్ప వరం లాంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది మంది క్రియేటివ్ మైండ్స్‌ను ఒకే వేదికపై అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ వేసిన ఈ అడుగు రాబోయే రోజుల్లో సరికొత్త సినిమా విప్లవానికి నాంది పలకనుంది. ఇంకెందుకు ఆలస్యం, మీలో ఉన్న క్రియేటివ్ పవర్‌ను నిరూపించుకోవడానికి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేసే అరుదైన అవకాశాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. పీకేసీడబ్ల్యూ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ కమ్యూనిటీలోకి ప్రవేశించే పూర్తి వివరాలను తెలుసుకొని, మీ సినిమా ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించండి.






