Home

»

Latest News

Lavanya Tripathi: ‘సతీ లీలావతి’.. మెగా కోడలు వచ్చేది ఎప్పుడంటే..?

Apr 25, 2026

లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల (Lavanya Tripathi Konidela), దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతోన్న సినిమా ‘సతీ లీలావతి’ (Sathi Leelavathi). ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌(శివ మ‌న‌సులో శృతి) ఫేమ్ తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 8న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా మేక‌ర్స్‌ ప్రకటించారు. 

రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత బ‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని 'స‌తీ లీలావ‌తి' చిత్రంలో ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌. భార్య‌, భ‌ర్త మ‌ధ్య ఉండే అనుబంధాన్ని ఎమోష‌నల్‌గానే కాకుండా ఎంట‌ర్‌టైనింగ్‌గానూ చెప్పే ప్ర‌య‌త్న‌మే 'స‌తీ లీలావ‌తి' చిత్రం. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాను రూపొందించామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి విడుదలైన రెండు సాంగ్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా మిక్కీ జే మేయర్, కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య పని చేస్తున్నారు. న‌రేశ్ వి.కె, స‌ప్త‌గిరి, వీటీవీ గ‌ణేశ్‌, మొట్ట రాజేంద్ర‌న్‌, జాఫ‌ర్‌, జోషి త‌దిత‌రులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com