Home

»

Latest News

Ajith: ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వలేదని.. హీరో అజిత్ ఏం చేశారో తెలిస్తే షాకవుతారు!

Apr 25, 2026

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌ (Ajith Kumar) కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ హీరో అని చాటిచెప్పే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్‌లో కష్టాల్లో ఉన్న సిబ్బంది కోసం అజిత్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా, ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తోంది.

సమీర్ పంచుకున్న ఆసక్తికర విషయం
తెలుగు నటుడు సమీర్ ఒక ఇంటర్వ్యూలో అజిత్ గొప్పతనం గురించి పంచుకున్నారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో యూనిట్‌లోని డ్రైవర్లు, ప్రొడక్షన్ సిబ్బందికి నిర్మాత నుంచి రావాల్సిన పేమెంట్స్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. భోజనానికి, వాహనాలకు డీజిల్ కొట్టించడానికి కూడా డబ్బులు లేక వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

మొదట నో చెప్పి.. ఆ తర్వాత షాక్ ఇచ్చి!
ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో సిబ్బంది అజిత్ మేకప్ రూమ్‌కు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. సిబ్బంది సమస్య విన్న అజిత్.. మొదట చాలా కఠినంగా వ్యవహరించినట్లు కనిపించారు. "మీ సమస్యకు, నాకు సంబంధం లేదు. మీరు నిర్మాతతోనే మాట్లాడుకోవాలి" అని చెప్పి వారిని పంపించేశారు. దీంతో ఆ సిబ్బంది తీవ్ర నిరాశకు లోనయ్యారు. 

అయితే, అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. కొద్దిసేపటికే అజిత్ షూటింగ్ సెట్ నుంచి మాయమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియక మేనేజర్లు కంగారుపడి ఫోన్ చేయగా.. "సిబ్బంది బకాయిలన్నీ తీర్చే వరకు నేను షూటింగ్‌కు రాను. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే నేనే ఇస్తాను, తర్వాత నా రెమ్యునరేషన్‌లో కట్ చేసుకోండి" అని అల్టిమేటం జారీ చేశారు.

నిజమైన మానవత్వం
అజిత్ హెచ్చరికతో నిర్మాత వెంటనే స్పందించి సిబ్బంది బకాయిలన్నీ క్లియర్ చేశారు. తమ కష్టాన్ని గుర్తించి, పట్టుబట్టి మరీ డబ్బులు ఇప్పించిన అజిత్ గొప్ప మనసుకు సిబ్బంది ఫిదా అయ్యారు. ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోవడమే కాకుండా, దాన్ని పరిష్కరించే వరకు పట్టుదలగా నిలబడటం అజిత్ వ్యక్తిత్వానికి నిదర్శనం.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com