Home

»

Latest News

సరైనోడు ' బ్లాక్ బస్టర్ ' టీజర్ రిలీజైంది

Mar 26, 2016 12:18PM

అల్లు అర్జున్ సరైనోడికి సరైన అప్ డేట్ వచ్చి చాలా రోజులైపోయింది. దాంతో బన్నీ ఫ్యాన్స్ ను ఊరించడానికి బ్లాక్ బస్టర్ సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు మూవీ టీం. ఇంకా రీలీజవ్వకుండానే బ్లాక్ బస్టర్ ఏంటా అని ఆలోచించకండి. ఆ సాంగ్ పేరే బ్లాక్ బస్టర్. రాజోలు పాప అంజలి, ఐటెమ్ గర్ల్ గా ఈ సాంగ్ లో చిందేసింది. " చిలకలూరి చింతామణి నా పేరంటే తెలియనోళ్లు లేరే జానీ " అంటూ సాగే ఈ సాంగ్ లో బ్లాక్ బస్టరే..బ్లాక్ బస్టరే..నే చెయ్యేస్తే నీ లైఫు బ్లాక్ బస్టరే..అని బన్నీ ఎంటరవుతాడు. తమన్ బీట్ యాజ్ ఇటీజ్ గా ఉన్నా, అల్లు వారబ్బాయి డ్యాన్స్ చించేశాడు. ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో స్ప్రెడ్ అవుతోందీ సాంగ్ టీజర్. పనిలో పని మీరూ ఓ లుక్కేస్కోండి మరి..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com