Home

»

Latest News

హ్యాపీడేస్ హీరోను వర్మగారు ఇలా మార్చేశారు..!

Mar 26, 2016 11:57AM

రామ్ గోపాల్ వర్మ అనేక వివాదాల మధ్య వంగవీటిని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రియల్ లైఫ్ పాత్రకు చాలా దగ్గరగా పోలికలుండే నటుల్ని ఎంచుకోవడం వర్మకు కెమేరా కన్నుతో పెట్టిన విద్య. ఇప్పటి వరకూ వంగవీటిలోని రెండు లుక్స్ ను రిలీజ్ చేసిన వర్మ తాజాగా వంగవీటి మురళి అంటూ మరో లుక్ రిలీజ్ చేశారు. అచ్చం రియల్ లైఫ్ మురళికి చాలా దగ్గరగా ఉన్న ఈ నటుడు ఎవరబ్బా అని అందరూ ఆలోచిస్తుంటే, సస్పెన్స్ ను వర్మే బ్రేక్ చేశారు.

హ్యాపీడేస్ లో వన్ ఆఫ్ ది హీరోస్ గా యాక్ట్ చేసిన వంశీనే తన సినిమా కోసం ఇలా మార్చేశారు వర్మ. హ్యాపీడేస్ టీనేజ్ కుర్రాడి లుక్ కు, ఇక్కడ వైట్ అండ్ వైట్ లుక్ కు అసలు సంబంధమే లేదు. వర్మగారు ఏం ఛేంజ్ ఓవర్ చేయించారు అని అందరూ అనుకునేలోపే, క్రెడిట్ తనది కాదని, వంశీ డెడికేషన్ వల్లనే ఈ లుక్ సాధ్యమైందని పూర్తి క్రెడిట్ వంశీకే ఇచ్చేశారు. హ్యాపీడేస్ సూపర్ హిట్టయినా, వంశీ పెద్దగా అవకాశాలు తెచ్చుకోలేకపోయాడు. మరి ఈ సినిమాతో, వంశీకి బ్రేక్ వస్తుందేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com