
‘శతమానం భవతి’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న నుంచి వస్తున్న కొత్త సినిమా ‘సరిపోయారు ఇద్దరూ’. మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న, రాజేంద్ర ప్రసాద్, నరేష్ తదితరులు నటించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ‘సరిపోయారు ఇద్దరూ’ కొత్త సినిమా కాదు. దాదాపు ఐదేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. అప్పట్లో దీనికి ‘కోతి కొమ్మచ్చి’ అనే టైటిల్ పెట్టారు.
అంతేకాదు.. 2021లో ‘కోతి కొమ్మచ్చి’ నుంచి థీమ్ సాంగ్ కూడా విడుదలైంది. ఆ సమయంలో కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు.
కానీ ఎందుకో సినిమా మాత్రం థియేటర్లలోకి రాలేదు. మధ్యలో ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా చర్చ కూడా కనిపించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు టైటిల్ మార్చి ‘సరిపోయారు ఇద్దరూ’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అయితే టైటిల్ మార్చినప్పటికీ.. విజువల్స్, నటీనటుల లుక్, మేకింగ్ చూస్తుంటే ఇది ఇప్పుడే షూట్ చేసిన సినిమా కాదని ఈజీగా అర్థమైపోతోంది.
ఇప్పుడు టైటిల్ మార్చి, కొత్తగా ప్రమోషన్స్ మొదలుపెట్టడంతో ఈ పాత సినిమాకు కొత్తగా ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం తీసిన సినిమాను ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచికి ఎంతవరకు కనెక్ట్ చేయగలరు? అనేదే అసలు ప్రశ్న.
ఇది కూడా చదవండి: 'ఆదర్శ కుటుంబం' వాయిదాకు అసలు కారణమేంటి.. టీమ్ డిజప్పాయింట్ అయిందా.?
[Saripoyaru Iddaroo Movie Teaser, Director Vegesna Satish, Kothi Kommachi Movie, Shatamanam Bhavati Movie, Director Anil Ravipudi, Telugu Movies 2026, Telugu Film News]






