Home

»

Latest News

ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు స‌ర్దార్‌??

Mar 24, 2016 3:37PM

ఎన్న‌డూ లేని విధంగా.. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాకి వీలైనంత హైప్ క్రియేట్ చేయాల‌ని భావిస్తోంది చిత్ర‌బృందం. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ విష‌యంలో ఆప‌సోపాలు ప‌డిపోతున్నారు. ఆఖ‌రికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఓ చేయి వేస్తున్నాడు. ఎప్పుడూ ప‌బ్లిసిటీ ఆడంబ‌రాల‌కు దూరంగా ఉండే వ‌వ‌న్ క‌ల్యాణ్‌... త‌న ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా స‌ర్దార్ కోసం కొన్ని త్యాగాలు చేస్తున్నాడ‌ని, త‌న సినిమాకి వీలైనంత ప‌బ్లిసిటీ క‌ల్పించ‌డానికి తెగ ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజాగా... సర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని హిందీలో ఈరోస్ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ సంస్థ రూ.12 కోట్ల‌కు కొనుగోలు చేసింద‌న్న‌ది టాక్‌. నిజంగా ఇది టాలీవుడ్‌కి దిమ్మ‌తిరిగే న్యూసే. ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆనందాల‌కు అవ‌ధుల్లేని వార్త‌. అయితే.. ఈ న్యూస్ కూడా కేవ‌లం హైప్ క్రియేట్ చేయ‌డానికి వ‌దిలింద‌ని టాక్‌.

ఈరోస్‌, శర‌త్ మ‌రార్‌, ప‌వ‌న్  ఈ ముగ్గురూ క‌ల‌సి స‌ర్దార్ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ముగ్గురు నిర్మాత‌ల‌న్న‌మాట‌. హిందీ వెర్ష‌న్‌ని ప్ర‌త్యేకంగా అమ్మ‌లేదు. ఈరోస్ త‌న పేరుమీద ఈ సినిమాని హిందీలో విడుద‌ల చేస్తోంది. ఆ మాత్రం దానికే రూ.12 కోట్ల‌కు అమ్మేశాం అని చెప్పి స‌ర్దార్ టీమ్ హైప్ క్రియేట్ చేయాల‌ని చూస్తోంది. డిస్ట్రిబ్యూట‌ర్ మ‌నోడే అయిన‌ప్పుడు ఎంత‌కిస్తే ఏంటి?  ఆ డ‌బ్బుల‌న్నీ అంకెల్లోనే త‌ప్ప‌.. క్యాష్ రూపంలో క‌నిపించ‌దు. ప‌వ‌న్ హిందీ సినిమాకి ఇంత బిజినెస్ జ‌రిగిందా?  అని మిగిలిన‌వాళ్లు అనుకోవాల‌ని, దాంతో హైప్ వ‌చ్చేస్తుంద‌ని ఇంత స్కెచ్ వేస్తోంది చిత్ర‌బృందం. ప‌వ‌న్ సినిమాకి ఇలాంటి ప్లానింగులు స్కెచ్చింగులు అవ‌స‌రంలేదు. ప‌వ‌న్ బొమ్మ క‌నిపిస్తే చాలు. క్రేజ్ ఆటోమెటిగ్గా త‌న్నుకొని వ‌చ్చేస్తుంది. అలాంట‌ప్పుడు ఈ చీప్ ట్రిక్స్ ఎందుకు స‌ర్దార్‌??

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com