పవన్ ఇచ్చిన ఆ ఇంటర్వ్యూల వెనుక రహస్యం అదా..!
on Mar 24, 2016
.jpg)
పవన్ కు బేసిగ్గా సిగ్గెక్కువ. ఇంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా, ఎప్పుడూ వీలైనంత సైలెంట్ గా ఉండటానికే ప్రిఫరెన్స్ ఇస్తాడు. అందుకే తెలుగు మీడియాలో ఎవరికైనా పవన్ ఇంటర్వ్యూ కావాలంటే, చుక్కలు కనబడతాయి. కానీ పవన్ రీసెంట్ గా బాలీవుడ్ క్రిటిక్ అనుపమా చోప్రాకు, దైనిక్ జాగరణ్ ఫిల్మ్ ఎడిటర్ అజయ్ బ్రహ్మాత్మజ్ కు మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మరి మిగిలిన వారెవరికీ ఎందుకివ్వలేదు..? అందుక్కారణాలున్నాయి. మొదట ఈ రెండు ఇంటర్వ్యూలు కూడా పవన్ ఇవ్వననే అన్నాడట. కానీ హిందీ రిలీజ్ కు ఇక్కడిలా కుదరదని, ప్రమోషన్ లేకపోతే అక్కడి జనాలు చూడరు అని మూవీ టీం నచ్చజెప్పేసరికి ఒప్పుకున్నాడు. అది కూడా ఈ ఇద్దరికీ మాత్రమే.
.jpg)
ఎందుకంటే, అనుపమా చోప్రా యూట్యూబ్ ఛానల్ కు బాలీవుడ్ లో జెన్యూన్ రివ్యూ ఇస్తుందనే పేరుంది. అంతేకాక, ఆమె ఫాలోవర్లు ఆమె రివ్యూలను, ఇంటర్వ్యూలను విశ్వసిస్తారు. ఈ బేస్ మీదే ఆమెకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక రెండోది అజయ్ బ్రహ్మాత్మజ్ ఇంటర్వ్యూ. అజయ్ దైనిక్ జాగరణ్ అనే హిందీ పేపర్ కు ఎడిటర్. ఇండియాలోనే అత్యధిక సర్క్యులేషన్ గల పత్రిక దైనిక్ జాగరణ్. సో, వేరే ఆలోచన లేకుండా, ఆ పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చేశాడు. టోటల్ గా చూస్తే బాలీవుడ్ సోషల్ మీడియా, హిందీ పేపర్ చదివే రూరల్ పీపుల్..ఇవీ పవన్ టార్గెట్ చేసుకున్న ఏరియాలు. అందుకే క్యాలికులేటెడ్ గా వాళ్లిద్దరికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. సినిమా రిలీజ్ దగ్గరయ్యే కొద్దీ వేరే ఇంటర్వ్యూలు ఇస్తాడా అన్నది చూడాల్సి ఉంది. అదండీ పవన్ జంట ఇంటర్వ్యూల వెనక రహస్యం..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



