Home

»

Latest News

సర్దార్ హిందీ టీజర్ : పవన్ మరీ ఇంత అన్యాయమా

Mar 17, 2016 4:47PM

సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ బాలీవుడ్ లో గ్రాండ్ స్టైల్ లో అడుగుపెడుతున్నాడు. అందుకే ఇంటర్వ్యూలు ఇష్టం లేకపోయినా, బాలీవుడ్ క్రిటిక్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు పవన్. కాసేపటి క్రితం ఎరోస్ నౌ సర్దార్ హిందీ టీజర్ రిలీజ్ చేసింది. మన టీజర్ మొత్తం కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో నింపేశారు కానీ హిందీ టీజర్ మాత్రం, ఫుల్ యాక్షన్ తో కుమ్మేశాడు పవన్.

జో డర్ గయా..సమ్ జో మర్ గయా అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. గన్ భుజం మీద పెట్టుకుని యాటిట్యూడ్ తో పవన్ ఇచ్చే లుక్స్, గన్ సింగిల్ హ్యాండ్ తో లోడ్ చేసి రౌడీ ని పేల్చే షాట్, పిల్లలతో కలిసి పవన్ సిగ్నేచర్ బెల్ట్ స్టెప్, కార్లో ట్రావెల్ అవుతూ, గన్స్ దడదడాలాడించే షాట్, లాస్ట్ లో సింపుల్ గా గన్ ను ఒక రౌండ్ తిప్పి తిరిగి బెల్ట్ లో పెట్టే షాట్..

ఇవీ టీజర్లో మెయిన్ షాట్స్. హిందీ వాళ్లకెలా అనిపిస్తుందో గానీ, తెలుగోళ్లు మాత్రం గర్వంగా మనోడి సినిమారా అని చెప్పుకునేలా ఉంది టీజర్. కానీ పవనాభిమానులు మాత్రం ఇదేం అన్యాయం పవన్. ఈ యాక్షన్ మన టీజర్లో కూడా పెడితే నీకు పోయిందేముంది అంటున్నారు. కరెస్టే మరి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com