Home

»

Latest News

ప్రేమమ్ హీరోయిన్ తో రాజ్ తరుణ్ సినిమా

Mar 17, 2016 4:15PM

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్స్ లోకి చేరుకున్న రాజ్ తరుణ్ డైరీ ఇప్పుడు ఫుల్ గా ఉంది. వరస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నాడీ వైజాగ్ కుర్రాడు. తాజాగా దిల్ రాజు బ్యానర్లో మంచి ఫ్యామిలీ మూవీ చేసే ఛాన్స్ కొట్టేశాడు. శతమానం భవతి పేరుతో రాబోతున్న ఈ సినిమాలో ' ప్రేమమ్ ' ఫేం అనుపమా పరమేశ్వరన్ ను రాజ్ తరుణ్ కు జోడీగా సెలక్ట్ చేశారట. ఇప్పటికే ఈ భామ చైతూతో ప్రేమమ్ చేస్తోంది. ' శతమానంభవతి ' ని మొదట సాయి థరమ్ తేజ్ తో అనుకున్నాడు దిల్ రాజు. కానీ అనుకోని కారణాల వల్ల చివరికి ఈ సినిమా రాజ్ తరుణ్ ఒళ్లో వాలింది. చివరిగా వచ్చిన తన సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా నిరాశ పరచడంతో, ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు రాజ్ తరుణ్. సేమ్ సిట్యువేషన్ విత్ దిల్ రాజు కూడా. దీంతో ఇప్పుడీ సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి సినీజనాల్లో ఉంది. రాజ్ తరుణ్-అనుపమా పరమేశ్వరన్..రైమింగ్ అయితే బాగుంది మరి..

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com