100 కోట్ల క్లబ్ లో `ఎఫ్ 2`
on Jan 25, 2019
విక్టరి వెంకటేష్, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్ 2` అయితే మల్టీస్టారర్ చిత్రాల్లోనే ఈ చిత్రం ఓ రేర్ ఫీట్ ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మల్టీస్టారర్ చిత్రాల్లోనే ఇంత వరకు వంద కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం లేదు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 చిత్రం ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో యాభై కోట్ల కు పై గా షేర్ రాబట్టగా ప్రపంచ వ్యాప్తంగా కేవలం 13 రోజుల్లోనే 68 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలు నిరాశపరిచినా కానీ, ఎఫ్ 2 చిత్రం మాత్రం ఎక్స్ పెక్ట్ చేయని విజయాన్ని అందించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ , వరుణ్ తో పాటు మరో హీరో కూడా ఈ సినిమాలో నటించనున్నాడట.