Home

»

Latest News

సందీప్ రెడ్డి వంగా ఫైర్: రాప్తాడు విషాదాన్ని అడ్డం పెట్టుకుని టార్గెట్ చేస్తున్నారు.!

Nov 4, 2026 1:52PM

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుందనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' సినిమాల విషయంలో ఈ చర్చ చాలాసార్లు తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఏపీలోని రాప్తాడులో చోటుచేసుకున్న దారుణ ఘటన మళ్లీ సందీప్ వంగాను వార్తల్లోకి తీసుకొచ్చింది. ఈ ఘటనకు సినిమాల్లోని హింసాత్మక సన్నివేశాలే కారణమంటూ కొందరు విమర్శలు చేయడంతో ఆయన తాజాగా ఘాటుగా స్పందించారు.

అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై 21 ఏళ్ల యువకుడు రంపంతో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. పాఠశాల తరగతి గదిలోనే ఈ దారుణం జరగడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.. నిందితుడి ప్రవర్తనను సినిమాల్లో చూపించే హింసతో ముడిపెడుతున్నారు. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ తుపాకీతో స్కూల్ క్లాస్‌రూమ్‌లోకి వెళ్లే సన్నివేశాన్ని ప్రస్తావిస్తున్నారు.

దీంతో సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హింసను గ్లోరిఫై చేస్తున్నారని, ఇలాంటి సినిమాలు యువతపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు అయితే ఇలాంటి సినిమాలు తెరకెక్కించే దర్శకులపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తన సినిమాలపై వస్తున్న ఈ విమర్శలకు తాజాగా సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇలాంటి భయంకరమైన నేరం జరిగినప్పుడు మొదట బాధితుల పట్ల సానుభూతి చూపించాలని, ఘటన వెనుక ఉన్న అసలు సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. అంతేకానీ, ప్రతి విషయానికి సినిమాలను బలిపశువులను చేయడం సరికాదని మండిపడ్డారు.

ఈ విషాదాన్ని అడ్డం పెట్టుకుని కొందరు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా ఇతరుల సినిమాలపై విమర్శలు చేసే అవకాశం దొరికినప్పుడల్లా సామాజిక సంస్కర్తలుగా మారే కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక విషాదానికి కావాల్సింది సానుభూతి మాత్రమేనని, అవకాశవాదం కాదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: రాప్తాడు ఘటన వెనుక అసలు నిజాలు.. సినిమాల వల్లే నేరాలు జరుగుతున్నాయా.?

 

 

 

[Sandeep Reddy Vanga, Raptadu Incident, Animal Movie Controversy, Cinema Violence Debate, AndhraPradesh, AP News, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com