సమంత సంచలన ట్వీట్..!!
on Feb 21, 2016

సినీ సెలబ్రిటీలో ట్విట్టర్లో అత్యంత యాక్టివ్ గా ఉంటుందని సమంతకు పేరుండేది. కానీ ఏమైందో ఏమో, కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేసి విమర్శలు వివాదాలు కొని తెచ్చుకుని ట్విట్టర్ కు దూరమైంది. చివరిగా డిశంబర్లో ట్వీట్ చేసిన సమంతకు, ఇన్నాళ్లకు మళ్లీ ట్విట్లర్ గుర్తొచ్చింది. పెట్టక పెట్టక ఒక ట్వీట్ పెడితే ఇప్పుడు అది కూడా సంచలనంగా మారింది. " నీతో ఉంటే నాకు సైన్యం తోడుగా ఉన్నట్టుంటుంది. ఐయామ్ బ్యాక్ " అని లవ్ సింబల్ పెట్టింది. దీంతో సమంత ఎవరితోనో లవ్ లో పడిందని పుకార్లు మొదలైపోయాయి. కానీ ఇంగ్లీష్ లో ఉన్న ఆ ట్వీట్ మీనింగ్ మరో రకంగా కూడా ఉండచ్చని, " ఇన్నాళ్లుగా అభిమానులకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్లీ ట్విట్టర్ వాడబోతున్నాను. అభిమానులే నాకు అండ " అనేది ఆ ట్వీట్ అర్ధం అని వివరిస్తున్నారు ఆమె అభిమానులు.. ఇంగ్లీష్ లో యు అంటే మీరు వస్తుంది. నువ్వు కూడా వస్తుంది. ఇంగ్లీష్ తో సమంతకు ఎన్ని తిప్పలొచ్చాయో పాపం అంటూ కిసుక్కుమంటున్నారు నెటిజన్లు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



