Home

»

Latest News

సమంత ఫ్యామిలీ ఇదే...

Nov 6, 2016 12:02PM

 

అక్కినేని నాగార్జున తనయులు అఖిల్, నాగచైతన్యల పెళ్లిళ్ల గురించి గత కొద్ది కాలంగా వార్తలు తెగ హల్  చల్ చేసిన సంగతి కూడా తెలిసిందే. నాగ చైతన్య, సమంతల పెళ్లి సంగతేమో కాని.. అఖిల్, ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రియ భూపాల్‌ ల పెళ్లి మాత్రం త్వరలోనే జరగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటంటే.. ఇప్పటి వరకూ సమంత, చైతు.. అఖిల్, శ్రియా భూపాల్ ల ఫొటోలు విడివిడిగా కనిపించాయి. ఇప్పుడు నలుగురు కలిసి దిగిన ఒకే ఫొటో దిగారు. సమంత, నాగచైతన్య, అఖిల్‌, శ్రియలు కలిసి దిగిన ఫొటోని సమంత ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఫ్యామిలీ’ అని హ్యాష్‌టాగ్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫొటో లైక్ లు , షేర్లతో హల్ చల్ చేస్తుంది. కాగా సమంత, నాగచైతన్యలు వచ్చే ఏడాది వివాహం చేసుకోబోతున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com