Home

»

Latest News

క్రిష్ మళ్లీ వస్తే..!

Nov 5, 2016 4:28PM

హాలీవుడ్ సినిమాల్లోనూ..బుల్లితెర మీద మాత్రమే సూపర్‌హీరోస్‌ని చూసిన భారతీయులకు ఆ కొరత తీర్చాడు హృతిక్ రోషన్. కోయి మిల్ గయా అంటూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాడు క్రిష్. రాకేశ్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అన్ని వర్గాలను ఆకట్టుకున్న క్రిష్ కలెక్షన్ల వర్షం కురిపించాడు.

ముఖ్యంగా చిన్నారులైతే క్రిష్.. క్రిష్ అంటూ థియేటర్లలోనూ..ఇళ్లల్లోనూ సందడి చేశారు. ఆ తర్వాత దీనికి కొనసాగింపుగా 2006లో తీసిన క్రిష్, 2013 వచ్చిన క్రిష్-3ని ప్రేక్షకులు అంతే ఆదరించారు. తాజా సమాచారం ప్రకారం ఈ సీరిస్‌లో నాలుగో సినిమా తీసుకొచ్చేందుకు సన్నాహలు జరుగుతున్నాయి. ఈ క్రిష్ గతంతో పోలిస్తే కొత్తగా ఉంటాడట..ప్రేక్షకులు ఇప్పటి వరకు చూడని గ్రాఫిక్స్‌ ఈ సినిమాలో ఉంటాయట.  అందుకోసం అంతర్జాతీయంగా పేరున్న యాక్షన్ డైరెక్టర్‌‌ను వెతుకుతున్నట్లు బాలీవుడ్ టాక్. వచ్చే ఏడాది సమ్మర్‌లో సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్లేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com