
స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులకు నవంబర్ 19న మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. నవంబర్ 20న ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సమంత.. తమ కుమారుడి పేరును కూడా అభిమానులతో పంచుకున్నారు.
చిన్నారి చేతి వేళ్లను పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ ‘దేవ్ నిడిమోరు’ అని పేరు ప్రకటించారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ చిన్నారి పేరుపై పడింది.
అసలు ‘దేవ్’ అనే పేరుకు అర్థమేంటి? ఈ పేరును ఎంచుకోవడం వెనుక ఏదైనా ప్రత్యేకత ఉందా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
సంస్కృత మూలాలున్న ‘దేవ్’ అనే పేరుకు దేవుడు, దైవికమైన వ్యక్తి అనే అర్థాలు ఉన్నాయి. అలాగే ప్రకాశించేవాడు, కాంతివంతమైనవాడు అనే భావాలు కూడా ఈ పేరుతో ముడిపడి ఉన్నాయి. పవిత్రత, దైవత్వం, మంచితనానికి ప్రతీకగా ఈ పేరును భావిస్తారు.
చిన్నగా, సులభంగా పలకడానికి వీలుగా ఉండటంతో పాటు సంప్రదాయ అర్థాన్ని కలిగి ఉండటం ‘దేవ్’ పేరులోని ప్రత్యేకత. ఆధునికంగా అనిపిస్తూనే భారతీయ సంస్కృతితో అనుబంధం ఉండటం కూడా ఈ పేరును ఆకర్షణీయంగా మార్చింది.
ఇది కూడా చదవండి: సమంతకు బాబు పుట్టాడు.. పేరు కూడా రివీల్ చేశారు.!
[Samantha Son Name, Dev Name Meaning, Dev Nidimoru, Raj Nidimoru]





