Home

»

Latest News

ఈఎన్ఈ రిపీట్ తొలి రోజు రికార్డు కలెక్షన్స్: ఏమైంది ఈ సినిమాకి! 

Nov 20, 2026 12:01PM

నిన్న గోవా బ్యాచ్  విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల  ENE రిపీట్ అలియాస్ ఈ నగరానికి ఏమైంది’ పార్ట్ 2 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్స్ అన్ని కలకలలాడుతున్నాయి. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ చూద్దాం.

 ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం ₹1.24 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. వీటిలో తెలంగాణ నుంచే ₹97.22 లక్షలు రావడం విశేషం; ఇక్కడ 136 షోలలో 44,064 టికెట్లు అమ్ముడై 81.9% ఆక్యుపెన్సీ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో 73.2% ఆక్యుపెన్సీతో ₹15.51 లక్షలు, కర్ణాటకలో 88.5% ఆక్యుపెన్సీతో 8.80 లక్షలు, తమిళనాడులో 81.0% ఆక్యుపెన్సీతో ₹1.98 లక్షల వసూళ్లు వచ్చాయి. విదేశాల్లో కూడా ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీమియర్లలో  $300K మార్కును దాటి సత్తా చాటింది.

ఇక మొదటి రోజు పూర్తి స్థాయి వసూళ్ల విషయానికి వస్తే, ఇండియాలో మొత్తం 1,681 షోలలో ప్రదర్శితమై 5.85 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. గ్రాస్ వసూళ్లు 6.80 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో ప్రీమియర్స్ తో కలుపుకొని తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 11.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం పెద్ద విశేషం. ఈ మొత్తం వరల్డ్‌వైడ్ గ్రాస్‌లో ఇండియా గ్రాస్ వాటా 60.2% కాగా, ఓవర్సీస్ మార్కెట్ వాటా 39.8% (₹4.50 కోట్లు)గా నిలిచింది.  

రాష్ట్రాల వారీగా మొదటి రోజు గ్రాస్ వసూళ్లను పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిసి 6.00 కోట్ల గ్రాస్ అందించాయి. కర్ణాటక నుంచి 0.60 కోట్లు, తమిళనాడు నుంచి 0.10 కోట్లు, కేరళ నుంచి 0.01 కోట్లు, మిగతా భారత్ ప్రాంతాల నుంచి 0.09 కోట్ల గ్రాస్ వచ్చింది. 

ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తారతో శ్రుతి హాసన్ గ్రాండ్ కమ్‌బ్యాక్: రోహిణిగా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం!


2018లో వచ్చిన మొదటి భాగం ‘ఈ నగరానికి ఏమైంది’ సుమారు 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి లైఫ్‌టైమ్‌లో దాదాపు 12 కోట్లు వసూలు చేయగా, 2023లో రీ-రిలీజ్ అయినప్పుడు మొదటి రోజు 1.8 కోట్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ తొలి రోజే 11.30 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ రాబట్టి, ఒరిజినల్ సినిమా జీవితకాల వసూళ్లను దాదాపు తొలి రోజే చేరుకునే స్థాయిలో దూసుకుపోయింది.

 

మీకు నచ్చవచ్చు:ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ!
మీకు నచ్చవచ్చు:దుల్కర్ సల్మాన్ సంచలనం! 

 

[Ene Repeat, viswak sen, tarun Bhasker, Abhinav, Tollywood]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com