Home

»

Latest News

`ఎఫ్ 3` టీజ‌ర్ కి ముహూర్తం ఫిక్స్!

Nov 26, 2021 4:49PM

``అంతేగా.. అంతేగా..`` అంటూ విక్ట‌రీ వెంక‌టేశ్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కో-బ్ర‌ద‌ర్స్ గా వినోదాలు పంచిన చిత్రం `ఎఫ్ 2`. వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి రూపొందించిన ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్.. 2019 సంక్రాంతికి సంచ‌ల‌నం సృష్టించింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ గా `ఎఫ్ 3` తెర‌కెక్కుతోంది. మ‌రింత వినోదాన్ని జోడీస్తూ అనిల్ త‌యారు చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ఫిబ్ర‌వ‌రి 25న థియేట‌ర్స్ లోకి రాబోతోంది.

ఇదిలా ఉంటే.. `ఎఫ్ 3` టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌డానికి ముహూర్తం ఫిక్స్ చేసింద‌ట యూనిట్. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. వెంకటేశ్ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా డిసెంబ‌ర్ 13న `ఎఫ్ 3` టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలిసింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మ‌రి.. `ఎఫ్ 2` లాగే `ఎఫ్ 3` కూడా బాక్సాఫీస్ ముంగిట వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తుందేమో చూడాలి.

కాగా, `ఎఫ్ 3`లో వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ తో పాటు సునీల్, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com