చైతన్యతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన సమంత! ఏయే ఫొటోలు తీసేయలేదంటే...
on Oct 28, 2021
నాగచైతన్యతో విడిపోతున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కొద్ది రోజుల తర్వాత తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో అతనితో దిగిన ఫొటోలను సమంత డిలీట్ చేస్తూ వస్తోంది. నిన్నటికి 85 ఫొటోల దాకా ఆమె తొలగించినట్లు సోషల్ మీడియా యూజర్స్ లెక్కలు కట్టారు. ఈరోజు ఆమె మరిన్ని ఫొటోలను తొలగించింది. వాటిలో వారి పెళ్లి ఫొటోలతో పాటు విహార యాత్రల్లో ఎంజాయ్ చేసినప్పటి ఫొటోలు కూడా ఉన్నాయి.
జీవితంలో స్వేచ్ఛగా ముందుకు వెళ్లాలనుకుంటున్న సమంత, అందుకు అనుగుణంగా చైతన్యతో తన జ్ఞాపకాలన్నింటినీ చెరిపేయాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ అక్కినేని ఫ్యామిలీ గ్రూప్ ఫొటోతో పాటు, ఫ్రెండ్స్‌తో తామిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫొటోలను మాత్రం ఆమె డిలీట్ చేయలేదు. అలాగే తన పెంపుడు కుక్క హ్యాష్‌తో చైతూ ఉన్న పొటోను కూడా ఆమె తీసేయలేదు. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రమంగా ఆమె వర్క్, ఫ్యాషన్, ఆమె వెకేషనల్ టూర్స్‌తో నిండిపోతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంతకు ఇన్‌స్టాగ్రామ్‌లో 19.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. సోల్ సిస్టర్ శిల్పారెడ్డితో ఇటీవలే చార్ ధామ్ యాత్రను పూర్తి చేసుకొని వచ్చిన సామ్, ప్రస్తుతం తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్‌లతో దుబాయ్ టూర్లో ఉంది.
సమంత ఇన్‌స్టా అకౌంట్లో ఇంకా కనిపిస్తోన్న నాగచైతన్య ఫొటోలు...