మాజీ మిస్ తెలంగాణ ఆత్మహత్యాయత్నం!
on Oct 28, 2021

సోషల్ మీడియాలో లైవ్ వీడియో పెట్టి మాజీ మిస్ తెలంగాణ హాసిని ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. సకాలంలో పోలీసులు స్పందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. అయితే ఆమె ఆత్మహత్యాయత్నానికి ఓ యువకుడి వేధింపులే కారణమని తెలుస్తోంది.
హైదరాబాద్ నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని హిమాయత్‌నగర్ లో నివాసం ఉంటున్న హాసిని 2018లో మిస్ తెలంగాణగా ఎంపికైంది. అయితే గురువారం ఉదయం ఆమె ఉరి వేసుకుంటున్నట్లు లైవ్ వీడియో పోస్ట్ చేసింది. వీడియో చూసిన ఆమె స్నేహితులు నారాయణగూడ పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే స్పందించిన పోలీసులు హిమాయత్ నగర్ లో ఆమె నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి, ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా, తనను ఓ యువకుడు వేధింపులకు గురిచేస్తున్నాడని.. ఇటీవల హాసిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే హాసిని ఆత్మహత్యాయత్నం చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



