ఇన్‌స్టాలో చైతన్య ఫొటోలను డిలీట్ చేస్తోన్న సమంత!
on Oct 27, 2021
ఈ నెల మొదట్లో తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు నాగచైతన్య, సమంత ఇద్దరూ ప్రకటించారు. ఆ ఇద్దరి మధ్య విడిపోయేంతగా కలతలు చెలరేగడానికి ఎవరు కారణమంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో, ఇతర మాధ్యమాల్లో తెగ చర్చలు నడిచాయి. ఎక్కువమంది దీనికి సమంతనే బాధ్యురాలిగా పేర్కొంటూ కామెంట్లు చేశారు, ఆమెను ట్రోల్ చేశారు.
విడిపోయిన కొద్ది రోజులకే లైఫ్‌లో ముందుకు వెళ్లాలని డిసైడ్ చేసుకున్న సమంత ఒకవైపు కెరీర్ మీద దృష్టిపెడుతూనే, ఇంకోవైపు స్నేహితులతో, సన్నిహితులతో హాలిడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేస్తోంది. ఆసక్తికరమైన విషయమేమంటే ఇప్పటికీ ఆమె అక్కినేని ఫ్యామిలీలోని పలువురిని ట్విట్టర్లో ఫాలో అవుతుండటం! వారిలో నాగచైతన్య ఉండటం!!
అయితే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో మాత్రం అందుకు భిన్నమైన విషయం కనిపిస్తోంది. నాగచైతన్యతో కలిసివున్న ఫొటోలతో పాటు, అతడి సోలో ఫొటోలను కూడా తొలగిస్తూ వస్తోంది. అలా ఇప్పటికే 80కి పైగా ఫొటోలను ఆమె డిలీట్ చేసిందని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు. తన జ్ఞాపకాల్లోంచి చైతూను పూర్తిగా తీసెయ్యాలనే ఉద్దేశంతోనే ఆమె ఆ పని చేస్తుండవచ్చు. అయితే అక్కినేని ఫ్యామిలీ మొత్తంతో కలిసి దిగిన ఫొటోతో పాటు, చైతూ ఉన్న మరికొన్ని ఫొటోలు కూడా ఇంకా ఆమె ఇన్‌స్టాలో దర్శనమిస్తున్నాయి. త్వరలోనే వాటిని కూడా డిలీట్ చేసి, అతడిని అన్‌ఫాలో కూడా కావచ్చని ఊహించవచ్చు.
ఇటీవలే మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్ర చేసి వచ్చిన సమంత, ప్రస్తుతం తన స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్‌తో కలిసి దుబాయ్ టూర్లో ఉంది.
Also Read