Home

»

Latest News

మా ఇంటి బంగారంతో సమంత జాక్‌పాట్.. ఇంకా 100 కోట్ల మార్క్ దాట‌లేదా?

Jul 22, 2026 11:47AM

 

సమంత(Samantha)తో పాటు ఆమె అభిమానులు సైతం ఊహించని విధంగా మా ఇంటి బంగారం(Maa Inti Bangaram)భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అందుకోవడమే కాదు రిలీజ్ కి ముందు ప్రీ రిలీస్ బిజినెస్, రిలీజైన తర్వాత కలెక్షన్స్ విషయంలో రికార్డులని సృష్టించింది. కొన్ని రోజుల క్రితం ఓటిటి వేదికగా విడుదలై రికార్డు వ్యూస్ సృష్టించే పనిలో బిజీగా ఉన్న మా ఇంటి బంగారం  విడుద‌లై 32 రోజులు అవుతున్నా ఇంకా కొన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ మూవీ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు  99.51 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. కొన్ని చానెల్స్, వెబ్‌సైట్లు ఇంకా 100 కోట్ల మార్క్‌ అధికారికంగా నమోదు చేయకపోయినా, చిత్రబృందం మాత్రం వారం రోజుల క్రితమే సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు ప్రకటించింది. కానీ కలెక్షన్ల విషయంలో సమంత ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాస్తవ కలెక్షన్స్  మాత్రమే ప్రకటించాలని, మిస్ లీడ్ చేసే గణాంకాలు విడుదల చేయొద్దని  చిత్రబృందానికి సూచించినట్లు టాక్ వినిపిస్తోంది.

Also read: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి మృతి.. కోట్లాది మంది హృదయాల్ని గెలుచుకుంది

అందుకే అధికారిక లెక్కలు, ట్రేడ్ అంచనాల మధ్య స్వల్ప తేడా కనిపిస్తోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మా ఇంటి బంగారం’ నిర్మాణ వ్యయం సుమారు 30 కోట్ల వరకు ఉన్నట్లు సినీ వర్గాల అంచనా. అయితే డిజిటల్, శాటిలైట్, ఇతర నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే దాదాపు 35 కోట్ల ఆదాయం రావడంతో విడుదలకు ముందే సినిమా లాభాల్లోకి వెళ్లిందని సమాచారం.

samantha, maa inti bangaram, raj nidimoru, nandini reddy

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com