Home

»

Latest News

ప్రభాస్ 'స్పిరిట్'లో బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్.. సందీప్ రెడ్డి వైల్డ్ ప్లాన్.!

Jul 22, 2026 11:53AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి మేకింగ్ అంటేనే ఒక వైల్డ్ వైబ్ ఉంటుంది. దానికి తోడు ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడవ్వడంతో ఈ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 40 శాతానికి పైగా చిత్రీకరణ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటివరకు వెలువడిన పోస్టర్స్, ఆడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో రికార్డు స్థాయి వ్యూస్‌తో ట్రెండ్ అయ్యాయి. ఈ సినిమాలో తృప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా, ఐశ్వర్య దేశాయ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.

సందీప్ రెడ్డి వంగా తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మైండ్ బ్లోయింగ్ ఎలిమెంట్‌తో ప్రేక్షకులను షాక్‌కు గురిచేస్తుంటారు. ఇప్పుడు 'స్పిరిట్' విషయంలోనూ అదే తరహా మాస్టర్ ప్లాన్ ఒకటి సిద్ధం చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథను ఊహించని మలుపు తిప్పే ఒక ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్‌ను రంగంలోకి దించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న కత్రినా కైఫ్ ఈ ప్రాజెక్ట్‌కి ఒప్పుకుంటే సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్లడం ఖాయం. ఈ పాత్ర కథాంశంలో ఎంతో ప్రాధాన్యత ఉన్నది కావడం వల్ల ఆమె పాత్ర రాకతోనే మొత్తం స్టోరీ లైన్ అంచనాలకు అందకుండా మారిపోతుందని సమాచారం.

ఈ రోల్ కోసం కేవలం 2 రోజుల కాల్ షీట్స్ మాత్రమే అవసరమని తెలుస్తోంది. ఇది చిన్న గెస్ట్ రోల్ మాత్రమే కాదు, కథ మొత్తాన్ని ఒక ఊహించని మలుపు తిప్పే "గేమ్ ఛేంజింగ్" క్యారెక్టర్. ఉదాహరణకు 'ఖుషి' చిత్రంలో ఎస్.జె. సూర్య కనిపించేది కేవలం ఒక్క నిమిషం మాత్రమే అయినా, ఆ ఒక్క సీన్ సినిమా గమనాన్నే మార్చేస్తుంది. 'స్పిరిట్'లో రాబోయే ఈ బాలీవుడ్ భామ పాత్ర కూడా సరిగ్గా అలాగే ఉండబోతోందని టాక్. 

ఒకవేళ ఏవైనా కారణాల వల్ల కత్రినా కైఫ్ ఈ ప్రాజెక్ట్‌ చేయడం కుదరకపోతే, ప్లాన్-బి కింద మరో పాపులర్ బాలీవుడ్ ఫేస్‌ను కూడా సందీప్ రెడ్డి ఇప్పటికే లైన్‌లో పెట్టారట. అయితే ఆ రెండవ హీరోయిన్ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ప్రభాస్ ఖాకీ డ్రెస్ వేసుకొని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ సినిమాలో, ఇప్పటికే 40 శాతానికి పైగా టాకీ పార్ట్ పూర్తవ్వడం ఫ్యాన్స్‌కు పెద్ద ఊరట నిచ్చింది. సందీప్ రెడ్డి మార్క్ రా, రస్టిక్ టేకింగ్, ప్రభాస్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ అవతార్, దానికి తోడు ఈ సర్‌ప్రైజ్ బాలీవుడ్ ఎంట్రీలన్నీ కలిసి బాక్సాఫీస్ దగ్గర పాత రికార్డులన్నీ బద్దలవడం ఖాయమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

కథను మలుపు తిప్పే ఆ మెరుపు పాత్రలో కత్రినా కైఫ్ మెరుస్తుందో లేక మరెవరైనా సీన్ లోకి వస్తారో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.

 

 

Katrina Kaif, Spirit, Prabhas, Sandeep Reddy Vanga, Tripti Dimri

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com