Home

»

Latest News

సలోనీ పోలీసాఫీసర్ గా "తెలుగమ్మాయి"

Mar 17, 2011 12:20AM

saloni hot stills, saloni hot images, saloni hot pics, saloni hot photos, saloni hot pictures, saloni hot wall papers సలోనీ పోలీసాఫీసర్ గా "తెలుగమ్మాయి"అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. సలోనీ గతంలో "ధన", " అనగనగా ఒక ఊరిలో" వంటి చిత్రాల్లో నటించినా ఒక నటిగా, హీరోయిన్ గా ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. అలాగే సలోనీకి అవకాశాలూ కూడా రాలేదు. కానీ రాజమౌళి దర్శకత్వంలో, సునీల్ హీరోగా నటించిన "మర్యాదరామన్న" చిత్రంలో హీరోయిన్ గా నటించిన అనంతరం సలోనీకి అవకాశాలు బాగానే వస్తున్నాయి. అలా వచ్చిన సినిమానే ఈ "తెలుగమ్మాయి".

ఈ "తెలుగమ్మాయి" చిత్రంలో తన పాత్ర చాలా శక్తివంతమైనదనీ, ఆడాళ్ళని ఏడిపించే అల్లరి చిల్లరి కుర్రాళ్ళ పనిబట్టే పోలీసాఫీసర్ పాత్రనీ సలోనీ తెలిపింది. ఈ పోలీసాఫీసర్ పాత్రలో తన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంటోంది సలోనీ. ఈ "తెలుగమ్మాయి" చిత్రంలోని తన పాత్ర తనకు ఒక మంచి నటిగా ఇమేజ్ ని ఇస్తుందని కూడా సలోనీ ఆశపడుతోంది. ప్రస్తుతం సలోనీ హీరోయిన్ గా నటిస్తున్నఈ "తెలుగమ్మాయి" చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com