Home

»

Latest News

క్లబ్ లో నాగచైతన్య ఫైట్

Mar 17, 2011 2:55PM

naga chaitanya stills, naga chaitanya images, nagachaitanya pics, nagachaitanya photos,    nagachaitanya wallpapersక్లబ్ లో నాగచైతన్య ఫైట్ చేశాడట. నాగచైతన్య పేకాడటానికి క్లబ్ కెళ్ళి గొడవ పెట్టుకొని ఫైట్ చేశాడనుకుంటున్నారా...? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డి.శివప్రాసాదరెడ్డి నిర్మిస్తున్న చిత్రం కోసం హీరో నాగ చైతన్య ఒక క్లబ్ లో విలన్లతో ఫైట్ చేశాడు. అదీ విషయం. ఈ క్లబ్ లో చిత్రీకరించిన ఈ ఫైట్ కోసం ప్రత్యేకంగా థాయ్ ల్యాండ్ నుండి ఫైట్ మాస్టర్ ని పిలిపించారట.

ఈ ఫైట్ చాలా స్టైలిష్ గా వచ్చిందని తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఫిలిప్పీన్స్ లో ఒక పాటను కూడా చిత్రీకరించారు. ఈ విషయాలన్నీ నీకెలా తెలుసయ్యా అనుకుంటున్నారా...! ఈ చిత్ర నిర్మాత డి.శివప్రసాదరెడ్డి తనయుడు చందన్ రెడ్డి తన ట్విట్టర్ లో ఈ సంగతులన్నీ పోస్ట్ చేశాడండీ. ఈ సినిమా శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. బహుశా ఈ రానున్న వేసవికే ఈ నాగచైతన్య చిత్రం విడుదల కావచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com