Home

»

Latest News

సల్మాన్ ఇక సింగిల్ గానే!

Aug 3, 2016 3:51PM

తన సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూసి ఈ ఆలోచన వచ్చిందో లేక ఇందులో కూడా వేలు పెడదాం అనుకొన్నాడో తెలియదు కానీ.. హీరో, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్, సింగర్ ఇలా బహుముఖ ప్రజ్ణాశాలిగా తన ప్రతిభను పలుమార్లు ప్రూవ్ చేసుకొన్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరో కొత్త రంగంలోనూ అడుగిడుతున్నాడు. తాను నిర్మిస్తూ నటిస్తున్న తాజా చిత్రం "ట్యూబ్ లైట్" సినిమాతో సల్మాన్ ఖాన్ డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలెడుతున్నాడు. దీపికా పడుకొనే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం చైనా వార్ నేపధ్యంలో తెరకెక్కుతోంది. సల్మాన్ ఖాన్ ఓ మందబుద్ధి గల సైనికుడిగా నటిస్తున్నాడని బాలీవుడ్ వర్గాల సమాచారం. 

ఇక డిస్ట్రిబ్యూషన్ కూడా మొదలెట్టిన సల్మాన్ ఇకపై ఎవరైనా ఒక నిర్మాత లేదా దర్శకుడ్ని పార్టనర్ గా సెట్ చేసుకొని ఆడియో మొదలుకొని విడుదలవరకూ అన్నీ తానై చూసుకునేలా ప్లాన్ చేస్తున్నాడట. ఒకవేళ "ట్యూబ్ లైట్" సినిమా హిట్టయ్యి సల్మాన్ అనుసరిస్తున్న పద్ధతులు అతనికి భారీ లాభాలు తెచ్చిపెడితే.. ఇకపై కూడా అదే పద్ధతి ఫాలో అవుతూ.. వేరే కుర్రాళ్లను హీరోగా పరిచయం చేస్తూ సల్మాన్ రూపొందించే సినిమాల్ని కూడా అదే తరహాలో మార్కెట్ చేసుకొంటాడు!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com