
మన క్రిష్ దగ్గర సృజనాత్మకత కాస్త ఎక్కువగానే ఉన్నట్లుంది. అందుకే తన పెళ్ళికి అందరిలా సింపుల్ గా శుభలేఖలు పంచకుండా.. స్నేహితులకు, సన్నిహితులకు ఒక మంచి కవితాత్మక స్వాగతం పలికాడు. ఆగస్ట్ 7న హైద్రాబాద్ లో డాక్టర్ రమ్యతో జరగనున్న క్రిష్ వివాహ శుభలేక చూస్తే సంబంధం లేకపోయినా సరే పెళ్ళికి వెళ్ళి మరీ ఆశీర్వదించాలనిపించేలా ఉందా లేఖ. ఓసారి మీరూ చదవండి!
మీ క్రిష్ మనసారా వ్రాయుచున్న శుభ'లేఖ' ... ఉభయ కుశోలపరి ...
ఆగష్టు ఏడో తేదీన్నా పెళ్ళి., రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకి...
అదేదో హస్త నక్షత్ర యుక్త మీన లగ్న పుష్కరాంశట ... అర్ధం కాలేదు గానీ శబ్ధం బాగుంది అని సరేనన్నాను ...
నిజానికి స్వర్గం లోనే పెళ్ళి చేసేసి భూమ్మీదికి పంపిస్తాడంట భగవంతుడు ... అక్కడెవర్ని చేసుకున్నానో నిన్న మొన్నటిదాక గుర్తురాలేదు ... వెలగ వెంకట రమణ ప్రసాద్ గారనీ, వాళ్ళమ్మాయిని చూసాను ... స్వర్గం లో జరిగిన పెళ్ళంతా కళ్ళకి కట్టినట్టు కనిపించేసింది ... ఆ అమ్మాయినే నేనిప్పుడు చేసుకుంటా ... పేరు 'రమ్య సాయి' ... డాక్టరు ... వాళ్ళమ్మ గారు కూడా పేరుకి తగ్గట్టే పద్మావతి .
మన గండిపేటలో ఉస్మాన్ సాగర్ లేక్ దగ్గర గోల్కొండ రిసార్ట్ ఉంది కదా ... అందులోనే ... మీరు కుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్ను మా ఆవిడ్ని ఆశీర్వదించాలని మా అమ్మ అంజనా దేవి , నాన్న గారు సాయి బాబు గారు కూడా మీకు మరీ మరీ చేప్పమన్నారు ...
దేవతలే స్నేహితుళ్ళా వస్తారంట ... మీరొస్తే ఒక దేవత వచ్చినట్టే ... మీ కోసం, మీ ఆశీస్సుల కోసం వేద మంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చుస్తూంటాయని మర్చిపోకండి ...
మీ అందరి చలువ,
నా సినీ జీవితం "గమ్యం" తో మొదలైంది ...
నిజమైన నా జీవితం ఇప్పుడు "రమ్యం" గా మొదలవుతుంది ...
ఇట్లు
మీ కోసం ఎదురుచూస్తూ
క్రిష్.





.jpg)
