Home

»

Latest News

మెగా మల్టీస్టారర్!

Jul 1, 2016 1:04PM

మహేష్ బాబు, వెంకటేష్ మరియు వెంకటేష్-రామ్ లు కలిసి నటిస్తేనే సదరు సినిమాలను మల్టీ స్టారర్ సినిమాలంటూ ప్రచారం చేసేశారు దర్శకనిర్మాతలు. అయితే.. ఇప్పుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించనున్న మల్టీస్టారర్ వివరాలు తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒకట్రెండు కాదు ఏకంగా నాలుగు భాషల హీరోలను కలిపి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒక భారీ మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నాడు గౌతమ్ మీనన్. తమిళనాట నుంచి జయంరవి, మలయాళం నుంచి పృథ్వీ రాజ్, కన్నడ నుంచి పునీత్ రాజ్ కుమార్ లు హీరోలుగా నటించనున్న ఈ చిత్రంలో తెలుగు నుంచి సాయిధరమ్ తేజ్ నటించనున్నాడు. అనుష్క, తమన్నా కథానాయికలుగా నటించనున్న ఈ సినిమాలో తొలుత తెలుగు నుంచి బన్నీ పేరు వినిపించినప్పటికీ.. బన్నీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో సాయిధరమ్ తేజ్ ను ఫిక్సయ్యాడు గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తయిన ఈ చిత్రం త్వరలో సెట్స్ కు వెళ్లనుంది. ఈ సినిమా తరువాత సాయిధరమ్ తేజ్ స్టార్ డమ్ రెండింతలవ్వడం ఖాయం!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com