Home

»

Latest News

రామరాజు "చీకటి ప్రేమకథ"

Jul 1, 2016 1:14PM

"రామరాజు" అనే పేరు ఇంకా ఆడియన్స్ లో రిజిష్టర్ అవ్వకపోయినప్పటికీ.. ఆయన తెరకెక్కించిన మునుపటి చిత్రం "మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు", తాజా చిత్రం "ఒక మనసు" మాత్రం ప్రేక్షకుల మనసుల్లో గట్టి ముద్ర వేశాయి. ముఖ్యంగా "ఒక మనసు" దర్శకుడిగా రామరాజుకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అందుకే ఆ సినిమాను నిర్మించిన మధుర శ్రీధర్ రెడ్డి ఇమ్మీడియట్ గా రామరాజు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. 

అయితే.. ఇప్పటివరకూ క్లాస్ టచ్ ఉన్న సినిమాలను మాత్రమే తెరకెక్కించిన రామరాజు తాజా చిత్రంగా ఓ మసాలా లవ్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే కథ కూడా పూర్తయిన ఈ చిత్రానికి "చీకటి ప్రేమకథ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా కొత్తవారు నటిస్తారా? లేక ఎవరైనా స్టార్ హీరోహీరోయిన్లు నటిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com