డీజేకి చెక్ పెట్టేందుకు విన్నర్..?
on Nov 29, 2016

టాలీవుడ్‌లో చిత్ర పరిశ్రమలో ఏ ఫ్యామిలీలో లేనంతమంది హీరోలు మెగా ఫ్యామిలీ సొంతం. ఈ హీరోల్లో ఎవరి సినిమా ఫంక్షన్ జరిగినా అందరూ అటెండై ఎంకరేజ్ చేస్తుంటారు. అలాంటి మెగా హీరోల్లో ఇద్దరి మధ్య ప్రస్తుతం కోల్డ్‌వార్ నడుస్తోంది. వారెవ్వరో మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. రేపు డిసెంబర్‌తో మొదలు పెట్టి ప్రతి నెలా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు మెగా హీరోలు. డిసెంబర్ 9న రామ్‌చరణ్ ధ్రువ, సంక్రాంతికి మెగాస్టార్ ఖైదీ నెం.150, ఫిబ్రవరిలో అల్లు అర్జున్ డీజే, మార్చిలో పవన్ కాటమరాయుడు ఇలా వరుస సినిమాలతో మెగా ఫ్యామిలీ దండయాత్రకు సిద్ధమైంది.
అయితే కోల్డ్ వార్ నడుస్తున్న ఆ హీరోల్లో ఒక హీరోకి చెక్ పెట్టేందుకు సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేయించాలని చూస్తున్నాడట మరో హీరో. అదే గనుక జరిగితే ఫిబ్రవరిలో ముందు సినిమా విడుదల చేయాలనుకున్న హీరో డైలమాలో పడతాడు. ఎందుకంటే ఆ తర్వాత తెలుగు సినిమా షెడ్యూల్ చాలా టైట్.. వెంట వెంటనే భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. తొందరపడి సినిమాను రిలీజ్ చేస్తే బొక్కబొర్లాపడే అవకాశముంది. కాబట్టి సదరు హీరో కొంతకాలం వెయిట్ చేయకతప్పదు. ప్రస్తుతం ఇదే విషయం ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



