చరణ్‌కి మరో టెన్షన్ పట్టుకొంది
on Nov 29, 2016

అసలే రామ్ చరణ్‌కి హిట్స్ లేవు. చేసిన సినిమా బాల్చీ తన్నేస్తోంది. బాలీవుడ్ జంజీర్‌తో పరువు మొత్తం పోయింది. హీరోగా తన కెరీర్ గ్రాఫ్ ఆ సినిమాతో ఢామ్ అని కింద పడిపోయింది. గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్లీ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో కోలుకోలేని స్థితిలో పడిపోయాడు. ఇప్పుడు తన ఆశలన్నీ ధృవపైనే ఉన్నాయి. ఎలాగైనా సరే... ఈ సినిమాతో హిట్ కొట్టి, మళ్లీ ఫామ్ లోకి వద్దామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కీ పాజిటీవ్ టాక్ రావడంతో ఊపిరి పీల్చుకొన్నాడు చరణ్. అయితే... ఇప్పుడు చరణ్ కి మరో టెన్షన్‌పట్టుకొంది. ఈ సినిమా కోసం చరణ్ ఎంత కష్టపడినా.. ఆ క్రెడిట్ మొత్తం అరవింద్ స్వామి పట్టుకెళ్లిపోవడానికి రెడీగా ఉన్నట్టు టాక్. ధృవలో అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే.
అరవింద్ స్వామి పాత్ర ఎంత స్టైలీష్ గా ఉండబోతోంది.. తన పాత్ర ఎంత పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారు అనే విషయం ట్రైలర్ చూస్తే అరవింద్ స్వామి పాత్ర ముందు చరణ్ తేలిపోయాడనిపిస్తోంది. చరణ్ కంటే అరవింద్ స్వామినే స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కూడా దీనిపై జోకులు మొదలైపోయాయి. ధృవలో అరవింద్ స్వామినే హీరోలా కనిపిస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు. ఒకవేళ సినిమా హిట్టయినా అది అరవింద్ స్వామి పుణ్యమే అంటారేమో..?! ఇది నిజంగా చరణ్‌కి షాకిచ్చే విషయమే. తన దగ్గర్నుంచి అరవింద్ స్వామి క్రెడిట్ ఎక్కడ లాగేసుకొంటాడో అనే టెన్షన్ చెర్రీకి ఆల్రెడీ మొదలైపోయి ఉంటుంది. మరి దీన్నుంచి ఎలా బయటపడతాడో?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



