
వరుస అపజయాలతో విసిగిపోయిన సాయి ధరమ్ తేజ్ ..ఈ సారి ఎలాగైనా హిట్ట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో `నేను శైలజ` దర్శకుడు ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో `చిత్రలహరి` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఇటీవల భారీ సెట్ వేసినట్లు కూడా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఇది ఇలా ఉంటే...ఈ చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ఫైనల్ చేశాడట సాయి ధరమ్ తేజ్. `పిల్ల జమిందార్`, భాగమతి చిత్రాలతో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ ఇటీవల తేజు కు స్క్రిప్టు వినిపించాడట. నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ ట సుప్రీమ్ హీరో. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.





.jpg)
