Home

»

Latest News

స్పీడు పెంచిన ర‌కుల్‌!!

Dec 27, 2018 2:56PM

2018లో ఒక్క తెలుగు  సినిమాలో  కూడా న‌టించలేదు  ర‌కుల్ ప్రీత్ సింగ్‌.  క‌నీసం డ‌బ్బింగ్ సినిమాల‌తో కూడా ప్రేక్ష‌కులు ముందుకు రాలేదు. ఎక్కువ‌గా బాలీవుడ్ మీద దృష్టి పెడుతున్న ఈ భామ గ‌త ఏడాది హిందీ సినిమా `అయ్యారి` లో మాత్ర‌మే న‌టించింది. ప్రజంట్ రెండు త‌మిళం , రెండు హిందీ సినిమాల‌తో బిజీ బిజీ గా ఉందీ అమ్మ‌డు. అయితే చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఎన్టీఆర్ బ‌యోపిక్ లో శ్రీదేవి గా అల‌రించ‌నుంది.

అయితే తాజాగా ఆమె మ‌రో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఒక‌సారి ఆ వివరాల్లోకి వెళితే...యంగ్ హీరో నితిన్ ప్ర‌జంట్ ఛ‌లో చిత్ర ద‌ర్శ‌కుడు వెంకీ కుడుమ‌ల‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో ర‌ష్మిక న‌టిస్తోంది. ఈ ప్రాజెక్ట్ తో పాటు నితిన్‌, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటితో  ఓ సినిమాకు  ఓకే చెప్పాడని ఫిలిం న‌గ‌ర్ లో వార్త‌లు వెలువ‌డుతున్నాయి. అయితే ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకోవాల‌ని చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  నెక్ట్స్ ఇయ‌ర్ ర‌కుల్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఏడు సిల్వ‌ర్ స్క్రీన్ పై మెర‌వ‌ని ర‌కుల్ వ‌చ్చే ఏడు మాత్రం బాగానే హ‌ల్ చ‌ల్ చేయ‌నుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com