Home

»

Latest News

మొత్తం పోయిందిగా.. చైతూ

Nov 17, 2016 2:42PM

వాయిదాలు ప‌డీ.. ప‌డీ.. చివ‌రికి క్లిష్ట‌మైన ప‌రిస్థితుల్లో విడుద‌లైంది సాహ‌సం శ్వాస‌గా సాగిపో. పెద్ద నోట్ల ర‌ద్దు క‌ల‌క‌లంలో వ‌చ్చి... ఆ సంద‌ట్లో క‌లిసిపోయింది. గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ మూట‌గ‌ట్టుకొంది. ప్రేమ‌మ్ సినిమా హిట్‌.. చైతూకి ఈ స‌మ‌యంలో క‌ల‌సి రాలేదు. దాంతో పాటు గౌత‌మ్ మీన‌న్ క్రేజ్ కూడా అక్క‌ర‌కు రాలేదు. శుక్ర‌, శ‌ని, ఆది వారాలు కూడా థియేట‌ర్లు ఖాళీగా క‌నిపించాయి.

ఇక సోమ‌వారం నుంచి ప‌రిస్థితి చెప్ప‌క్క‌ర్లెద్దు. ముందు ఫ్లాప్ అనుకొన్న ఈ సినిమా ఇప్పుడు డిజాస్ట‌ర్ లిస్టులో చేరింది. దాదాపుగా రూ.22 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన సినిమా ఇది. ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.6 కోట్లు వ‌చ్చాయ‌ట‌. అంటే  మూడొంత‌లు పోయిన‌ట్టు. ప్రేమ‌మ్ హిట్ట‌యినా భారీ లాభాల్ని సంపాదించ‌లేక‌పోయాడు చైతూ. ఆ సినిమా వ‌సూళ్లు బ‌డ్జెట్ ద‌రిదాపుల్లోకి వ‌చ్చి ఆగిపోయాయి. కొన్ని చోట్ల బ‌య్య‌ర్లు స్ప‌ల్వంగా న‌ష్ట‌పోయారు కూడా. ఈ సినిమాకైతే దాదాపుగా అంతా పోయింది. చైతూ కెరీర్ కి ఇది పెద్ద కుదుపే. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com