Home

»

Latest News

ప‌వ‌న్ - బ‌న్నీ.. చిచ్చు ర‌గులుతోందా??

Nov 17, 2016 1:38PM

ఏ ఫ్యామిలీలో లేనంత‌మంది హీరోలు మెగా ఫ్యామిలీలో ఉన్నారు. ఒక‌రి ఆడియో ఫంక్ష‌న్ జ‌రిగితే చాలు.. అంద‌రూ పొలోమ‌ని హాజ‌రైపోతారు. ఒక్క ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌ప్ప‌. ప‌వ‌న్ గురించి మెగా హీరోలంతా గొప్ప‌గా మాట్లాడ‌తారు. చిరంజీవితో స‌హా. అయితే వ‌ప‌న్ మాత్రం ఎప్పుడూ ఎవ‌రి గురించీ నోరు విప్ప‌డు. అంద‌రితోనూ అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తుంటాడు. తాజాగా బ‌న్నీతో అయితే.. ప‌వ‌న్‌కి మాటల్లేవ‌ని తెలుస్తోంది. వీళ్లిద్ద‌రి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తోంద‌న్న గుస‌గుస‌లు ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఆమ‌ధ్య ఓ ఆడియో ఫంక్ష‌న్‌లో `చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌` అనే డైలాగ్‌తో ప‌వ‌న్ అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు బ‌న్నీ.

అయితే అంత‌కు ముందు నుంచీ ప‌వ‌న్ కీ - బ‌న్నీకీ మాటల్లేవ‌ని, ఆ ఎపిసోడ్‌తో వీరిద్ద‌రి మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింద‌ని తెలుస్తోంది. అల్లు అర‌వింద్ కీ ప‌వ‌న్‌కీ కూడా స‌న్నిహిత సంబంధాలు ఉండేవి కావు. ఆ ఎఫెక్ట్ బ‌న్నీపైనా ప‌డుతోంద‌ని టాక్‌. పైగా చ‌ర‌ణ్‌కీ, బ‌న్నీకీ కూడా రిలేష‌న్స్ అంత గొప్ప‌గా లేవ‌ని, ప‌వ‌న్ చ‌ర‌ణ్‌కి ఇచ్చే ప్రాధాన్య‌త బ‌న్నీకి అస్స‌లు ఇవ్వ‌డ‌ని, ఆ కోపం బ‌న్నీకీ ఉంద‌ని చెబుతుంటారు మెగా స‌న్నిహితులు. మ‌రి ఈ గ్యాప్ త‌గ్గుతుందా, లేదంటే మున్ముందు మ‌రింత పెరుగుతుందా, ఈ మెగా హీరోలిద్ద‌రూ క్లోజ్ అయ్యేదెప్పుడు అనేది కాల‌మే చెప్పాలి. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com