Home

»

Latest News

సాహసం శ్వాసగా సాగిపో కొత్త టీజర్ రిలీజయ్యింది..!

May 05, 2016

సాహసం శ్వాసగా సాగిపో..సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సినా, ఎందుకో లేటవుతూ వచ్చింది. సినిమా లేటయినా, సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ ఆసక్తికరంగానే ఉంటున్నాయి. జనవరిలో రిలీజ్ చేసిన ఎల్లిపోమాకే సాంగ్ కు రెహమాన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఈరోజు మరో సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ టీం. షోకిల్లా పేరుతో ఉన్న ఈ ఆడియో టీజర్ ఫుల్ జోష్ తో ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే, మంచి డాన్స్ నెంబర్ సాంగ్ ఇది. పాటతో పాటు, మేకింగ్ విజువల్స్ ను కూడా కొద్దిగా మిక్స్ చేశారు. సినిమా ఆడియో రిలీజయ్యే లోపు, వరసగా ఆడియో టీజర్లు వదులుతారని సమాచారం. మే మూడో వారంలో మూవీ ఆడియో రిలీజ్ కాబోతోంది. చైతూ, గౌతమ్, రెహమాన్ కాంబినేషన్లో వచ్చిన ఏమాయ చేశావో మ్యూజికల్ హిట్ గా నిలవడంతో, సాహసం శ్వాసగా సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మళయాళ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ హీరోయిన్ గా నటించింది. సినిమాను జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com