Home

»

Latest News

రోమాంచకం: గ్లింప్స్ ఇచ్చి పడేసారు.. ట్రైలర్ ఇలా చేశారేంటి.?

Aug 26, 2026 5:55PM

సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న మూవీ 'రోమాంచకం'. సుమంత్ ప్రభాస్, అనంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. గ్లింప్స్‌తో భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా, ఇప్పుడు ట్రైలర్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకోవడంలో తడబడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సందీప్ రెడ్డి వంగా అనే బ్రాండ్ చాలు.. 'రోమాంచకం'పై అంచనాలు ఏర్పడటానికి. పైగా, గ్లింప్స్ బాగుండటంతో, ట్రైలర్ అంతకు మించి ఉంటుందని ఫ్యాన్స్, సినీ ప్రియులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ట్రైలర్ బయటకు రాగానే సీన్ మారిపోయింది. గ్లింప్స్‌లో కనిపించిన ఆ స్పార్క్, ఎనర్జీ ట్రైలర్‌కి వచ్చేసరికి మిస్ అయ్యాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గ్లింప్స్‌తో హయ్యెస్ట్ హైప్ ఇచ్చి, ఆ తర్వాత వచ్చే ట్రైలర్ కట్ కన్ఫ్యూజింగ్‌గా ఉంటే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారో 'రోమాంచకం' విషయంలో అదే జరుగుతోంది. "ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ.." అంటూ ట్రైలర్‌లో అన్ని ఎలిమెంట్స్ చూపించినప్పటికీ.. లవ్ లో ఫ్రెష్ నెస్ లేదని, కామెడీ పంచ్‌లు అంతగా పేలలేదని, ఎడిటింగ్ అండ్ పేసింగ్ గందరగోళంగా ఉందనే టాక్ సోషల్ మీడియాలో మొదలైంది.

'రోమాంచకం'లో విషయముందని అర్థమవుతుందని, కానీ ట్రైలర్ కట్ అందుకు తగ్గట్టుగా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి సినిమా విడుదలకు ముందు.. రిలీజ్ ట్రైలర్ తో సర్ప్రైజ్ చేస్తారేమో చూడాలి.

 

 

 

Sandeep Reddy Vanga, Romanchakam Trailer, Sumanth Prabhas

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com