
నా పేరు మాస్ మహారాజా రవితేజ, నా సినిమా ఇరుముడి అంటూ బాక్స్ ఆఫీస్ వద్ద రవితేజ దూసుకుపోతున్నాడు. కేవలం నాలుగురోజులకే వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టడంతో ఇరుముడి ఫామ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ రోజు ఉదయం తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఉన్న స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏమాత్రం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి ప్రకటన చేయకుండా థియేటర్ యాజమాన్యం 'ఇరుముడి' సినిమా ప్రదర్శనని అకస్మాత్తుగా నిలిపివేసిందని అభిమానులు, పక్క గ్రామాల నుంచి వచ్చిన ప్రేక్షకులు మరియు అయ్యప్ప స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహావేశాలకే లోనయ్యారు. ఇరుముడి చూడాలనే ఆశతో గత రెండు రోజులుగా చుట్టుపక్కల మండలాల నుంచి వందలాది మంది జనం మక్తల్ వెంకటరమణ థియేటర్‌కు పోటెత్తుతున్నారు. తమ దైనందిన పనులను, వ్యక్తిగత పనులను సైతం పక్కన పెట్టి థియేటర్ వద్దకు వస్తున్నప్పటికీ, టికెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని ప్రేక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: నాగార్జున 100 వ చిత్రం గ్లింప్స్ రిలీజ్.. టైటిల్ ఇదేనా!
కనీసం బుధవారం అయినా సినిమా చూసే అవకాశం లభిస్తుందని ఎంతో ఆశతో థియేటర్‌కు వస్తే, ఉన్నపళంగా షో రద్దు చేశారన్న వార్త వారిని తీవ్ర నిరాశకు, ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సహనం కోల్పోయిన ప్రేక్షకులు థియేటర్ మెయిన్ గేటు ఎదుట పెద్ద ఎత్తున బైఠాయించి ఆందోళన చేపట్టారు. సినిమా ప్రదర్శనను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఎంతటి రద్దీనైనా తట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని, సీట్లు లభించకపోతే నేలపై కూర్చుని లేదా నిలబడి అయినా సినిమా తిలకిస్తామని అభిమానులు స్పష్టం చేయడం అక్కడ ఉన్న వారిని కదిలించింది. గత 2 రోజులుగా ఎదురుచూస్తున్న అభిమానుల భారాన్ని గుర్తించి థియేటర్ యాజమాన్యం మరియు నిర్వాహకులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే ప్రదర్శన ప్రారంభించి పరిస్థితిని సమీక్షించాలని, ప్రేక్షకుల డిమాండ్లను తీర్చాలని స్థానికులు స్పష్టం చేశారు. ఈ ఊహించని ఘటనతో మక్తల్ వెంకటరమణ థియేటర్ ప్రాంగణంలో కొంతసేపు ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులు తమ మేనరిజమ్స్ ని ప్రదర్శించాయి.
Raviteja, Irumudi, Nakshthra, Priya Bhavani Shankar






