Home

»

Latest News

ప‌వ‌ర్ స్టార్ తో `రాక్ స్టార్` బ్యూటీ!

Dec 6, 2021 10:47AM

`రాక్ స్టార్` (2011) చిత్రంతో ఇండియ‌న్ స్క్రీన్ పై న‌టిగా తొలి అడుగేసింది విదేశీ సోయ‌గం న‌ర్గీస్ ఫ‌క్రీ. మ్యూజిక‌ల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఆ సినిమాతో డ్రీమ్ డెబ్యూ ఇచ్చింది న‌ర్గీస్. ఆపై `మ‌ద్రాస్ కేఫ్` (2013), `మైన్ తేరా హీరో` (2014), `హౌస్ ఫుల్ 3` (2016) చిత్రాల‌తోనూ ఆక‌ట్టుకుంది. అలాగే హాలీవుడ్ మూవీస్ లోనూ అల‌రించింది.

ఇదిలా ఉంటే.. ఆ మ‌ధ్య `జులాయి` (2012) త‌మిళ్ రీమేక్ `సాహ‌సం` (2016) కోసం ప్ర‌త్యేక గీతంలో చిందులేసిన న‌ర్గీస్.. త్వ‌ర‌లో మ‌రో ద‌క్షిణాది చిత్రంలో సంద‌డి చేయ‌నుంద‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ కెప్టెన్ క్రిష్ `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` పేరుతో ఓ పిరియ‌డ్ డ్రామా తీస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ప‌వ‌న్ కి జోడీగా `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది. అలాగే మ‌రో నాయికగా శ్రీ‌లంక సుంద‌రి జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ న‌టించాల్సి ఉంది. అయితే, ఓ కేసులో ఇరుక్కున్న ఆమె ప్ర‌స్తుతం ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే.. న‌ర్గీస్ ఫక్రీతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట క్రిష్. త్వ‌ర‌లోనే `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు`లో న‌ర్గీస్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.  

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com