Home

»

Latest News

రేవతి దర్శకత్వంలో బాలీవుడ్ కి నటి స్నేహ

Mar 29, 2011 10:53AM

sneha hot wallpapers, sneha hot stills, sneha hot images, sneha hot pics, sneha hot photos,   sneha hot picturesరేవతి దర్శకత్వంలో బాలీవుడ్ కి నటి స్నేహ వెళ్ళనుందని సమాచారం. వివరాల్లోకి వెళితే హీరోయిన్ స్నేహకు తెలుగులో అవకాశాలు తగ్గటంతో దాదాపు కనుమరుగయ్యే స్థితిలో ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ ఉంది. అందుకే ఆమె బాలీవుడ్ వైపు తన దృష్టి మళ్ళించింది. ఆ దిశలో భాగంగా హిందీలో "మ్యాడ్ డాడీ" అనే చిత్రంలో నటించటానికి అంగీకరించింది. హీరోయిన్ గా మాత్రం కాదులెండి. హీరోయిన్ ఆయేషా టకియాకి తల్లి పాత్రలో నటి స్నేహ నటించటానికి అంగీకరించింది.

ఈ చిత్రానికి ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రంలో నటి స్నేహ ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా సరసన అతని భార్యగా నటించనుంది. అంటే ఆయేషా టకియాకి స్నేహ, నసీరుద్దీన్ షా తల్లిదండ్రులుగా నటిస్తారన్న మాట. ఇక ఈ చిత్ర దర్శకురాలు గతంలో తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన "ప్రేమ" అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com