Home

»

Latest News

అల్లు అర్జున్, హన్సిక జంటగా చిత్రం

Mar 29, 2011 10:40AM

hansika hot wallpapers, hansika hot stills, hansika hot images, hansika hot pics, hansika hot photos,   hansika hot picturesఅల్లు అర్జున్ హీరోగా, హన్సిక హీరోయిన్ గా ఒక చిత్రం రానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో అల్లు అర్జున్ హీరోగా, హన్సిక మోత్వానీ హీరోయిన్ గా త్వరలో ఒక చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. ఈ చిత్రానికి "ఆర్య" ఫేం సుకుమార్ దర్శకత్వం వహిస్తారట. గతంలో అల్లు అర్జున్ ‍, హన్సిక కలసి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో "దేశముదురు" అనే చిత్రంలో జంటగా నటించారు.

 

ఆ చిత్రం హీరోయిన్ గా హన్సిక మోత్వానికి తొలి చిత్రం కాగా ఆ చిత్రం సూపర్ హిట్టయ్యింది. మళ్ళీ అదే జంట కలసి నటిస్తూండటంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలుంటాయి. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటించిన "ఆర్య" చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. మరి వీరి ముగ్గురి కాంబినేషన్ లో రానున్న ఈ చిత్రం ఎన్ని సెన్సేషన్లు సృష్టిస్తుందో కాలమే చెప్పాలి. ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com