ENGLISH | TELUGU  

'RRR'ను 'గే లవ్ స్టోరీ' అనుకుంటున్నారా?

on Jul 6, 2022

'బాహుబలి' ఫ్రాంచైజ్ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' కూడా సంచలన విజయాన్ని సాధించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఓటీటీలో విడుదలయ్యాక వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. హాలీవుడ్ స్టార్స్ సైతం ఈ మూవీ చూసి ఫిదా అవుతున్నారు. అయితే కొందరు వెస్టర్న్ ఆడియన్స్ మాత్రం 'ఆర్ఆర్ఆర్'ను గే లవ్ స్టోరీ అనుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. ఈ విషయం గురించి గత నెలలో రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశాడు. మరోవైపు తారక్, చరణ్ ఫ్యాన్స్ కూడా.. ఒకరి హీరో ఫ్యాన్స్ మరో హీరోని గే అంటూ ట్వీట్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ 'గే లవ్ స్టోరీ' వివాదం తారాస్థాయికి చేరింది. 

మునీష్ భరద్వాజ్ అనే ఫిల్మ్ మేకర్ తాజాగా "గత రాత్రి RRR అనే 30 నిమిషాల చెత్త చూశాను" అంటూ ట్వీట్ చేయగా.. దానికి ప్రముఖ సౌండ్ డిజైనర్ రెసూల్ పూకుట్టి "గే లవ్ స్టోరీ" అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో వివాదం చెలరేగింది. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా రెసూల్ పూకుట్టి తీరుని తప్పుబట్టారు. "మీరు చెప్పినట్లుగా RRR ను 'గే లవ్ స్టోరీ' అని నేను అనుకోను. అయినా 'గే లవ్ స్టోరీ' అనేది చెడ్డ విషయమా?.. మీరిలాంటి వ్యాఖ్యలు చేయడం నిరాశకు గురిచేసింది" అంటూ ఆయన ట్వీట్ చేశాడు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఎంట్రీతో ఈ వివాదం మరింత ముదిరింది. తనకు అప్పర్ కేస్ లెటర్స్, లోయర్ కేస్ లెటర్స్ సరిగా ఉపయోగించడం రాదు కానీ అందరి భావప్రకటనా స్వేచ్ఛకు గౌరవం ఇస్తాను అంటూనే.. 'రెసూల్ పూకుట్టి' పేరులోని కొన్ని అక్షరాలను కాపిటల్ లెటర్స్ లో రాసి ఇన్ డైరెక్ట్ గా తిట్టాడు కీరవాణి.

"నేను ఇప్పుడు RRR నుండి రామ్ మరియు భీమ్ పాత్రలను చూడలేకపోతున్నాను. కిడ్నాప్‌కు గురైన తన కూతురు మల్లి కోసం జీవితాంతం ఎదురుచూసే తల్లి మాత్రమే నాకు కనిపిస్తున్నది. నా దృష్టి త్వరలో మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. అలాగే స్వాతంత్ర్యం కోసం వందల మందికి ఆయుధాలతో శిక్షణ ఇచ్చిన దేశభక్తుడిగా అజయ్ సర్‌ని కూడా నేను చూడగలను. కానీ మరెవరినీ ఎందుకు చూడలేకపోతున్నాను. ఎన్టీఆర్, చరణ్, ఆలియా నా క్యారెక్టర్ బ్లైండ్ నెస్ కి నన్ను క్షమించండి." అంటూ కీరవాణి వరుస ట్వీట్స్ తో రెచ్చిపోయాడు.

గతంలో వెస్టర్న్ ఆడియన్స్ కొందరు 'ఆర్ఆర్ఆర్' ను 'గే లవ్ స్టోరీ' అని సంబోధించినప్పటికీ.. ఇప్పుడు ఏకంగా రెసూల్ పూకుట్టి వంటి వ్యక్తి అనడంతో వివాదం చెలరేగింది. అయితే దురుద్దేశంతోనే 'ఆర్ఆర్ఆర్'పై ఇటువంటి వ్యాఖ్యలు చేసి, దాని పేరుని చెడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కూడా ఒక హీరోని మరొకరు కించ పరుస్తూ ఆర్ఆర్ఆర్ ప్రతిష్టకు నష్టం కలిగిస్తున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.