Home

»

Latest News

ఇక ద‌ర్శ‌న్‌, ప‌విత్ర‌ల ప‌ని అయిపోన‌ట్టేనా?.. కోర్టులో ప్రదోష్‌రావు చెప్పిన షాకింగ్ నిజాలు.!

Sep 30, 2026 1:54PM

కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ రావు కోర్టు ముందు పలు విషయాలను వెల్లడించారు. బెంగళూరులోని 59వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టులో తనకు తెలిసిన వివరాలను ఆయన వివరించారు. రేణుకాస్వామిపై దాడి జరిగిన సమయంలో నటుడు దర్శన్ వ్యవహరించిన తీరుకు సంబంధించి ప్రదోష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

తన వాంగ్మూలంలో భాగంగా.. రేణుకాస్వామిపై దర్శన్ తీవ్రంగా దాడి చేశారని ప్రదోష్ ఆరోపించినట్లు సమాచారం. రేణుకాస్వామి ప్యాంటు విప్పించి, అతడి మర్మాంగంపై తన్నారని ఆయన కోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నేలపై ఉమ్మి వేసి దాన్ని నాకాలని సూచించినట్లు కూడా ప్రదోష్ వెల్లడించారు. ఈ సమయంలో రేణుకాస్వామిని రక్షించేందుకు నాగరాజు ప్రయత్నించగా దర్శన్ తీవ్రంగా స్పందించారని, అనంతరం రేణుక ముఖంపై పంచ్ కొట్టారని చెప్పారు. 

రేణుకాస్వామి హత్య కేసులో ప్రదోష్ రావు గతంలో అప్రూవర్‌గా మారేందుకు కోర్టును ఆశ్రయించారు. పూర్తి, నిజమైన వివరాలను వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొనడంతో కోర్టు ఆయనకు అప్రూవర్ హోదా కల్పించింది. ఈ కేసులో తాను చూసిన, తనకు తెలిసిన విషయాలను కోర్టు ముందు వెల్లడించాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే లేదా కీలక విషయాలను దాచిపెడితే మళ్లీ నిందితుడిగా మారే అవకాశం కూడా ఉందని కోర్టు షరతులు విధించింది.

2024 జూన్‌లో చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడతో పాటు పలువురు నిందితులుగా ఉన్నారు. రేణుకాస్వామిపై జరిగిన దాడిలో మొత్తం 39 గాయాలు నమోదైనట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో అప్రూవర్‌గా మారిన ప్రదోష్ రావు చెప్పిన వివరాలు కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఆయన కోర్టులో వెల్లడించిన అంశాలు విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంటుంది.

 

 

[Renukaswamy Murder Case, Darshan Case, Darshan Renukaswamy Case, Pradosh Rao Approver, Renukaswamy Murder, Darshan Latest News, Pradosh Rao Statement, Pavithra Gowda, Kannada Cinema, Renukaswamy Case Court Hearing]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com