Home

»

Latest News

సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. అక్టోబర్‌లో ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు.!

Sep 30, 2026 2:05PM

సినిమా థియేటర్లలో మిస్ అయినా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకులకు అక్టోబర్ నెలలో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. వివిధ జానర్లకు చెందిన చిత్రాలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలకు చెందిన సినిమాలతో పాటు పలు డబ్బింగ్ కంటెంట్ కూడా ప్రేక్షకులను అలరించనుంది. అక్టోబర్ 1 నుంచే ఈ ఓటీటీ సందడి మొదలుకానుంది.

అక్టోబర్ 1న సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ నటించిన ‘రోమాంచకం’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే రోజున కార్తి నటించిన ‘సర్దార్ 2’ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రానుంది. అలాగే ‘దుపహియా’ రెండో సీజన్ కూడా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుండగా.. పంకజ్ త్రిపాఠి, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓహ్ మై డాగ్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక అక్టోబర్ 2న నివిన్ పౌలీ, మమిత బైజు నటించిన ‘బెత్లెహెమ్ కుటుంబం యూనిట్’ జియోహాట్‌స్టార్‌లోకి రానుంది. అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి నటించిన ‘లవ్’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో, మృణాల్ ఠాకూర్, హుమా ఖురేషి నటించిన ‘పూజా మేరీ జాన్’ జీ5లో స్ట్రీమింగ్ కానున్నాయి. అక్టోబర్ 8న సూరి, సుహాస్ నటించిన ‘మండాడి’ ఓటీటీలోకి రానుండగా.. అక్టోబర్ 9న పరిణీతి చోప్రా నటించిన ‘రిపోర్టింగ్ లైవ్’ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.

అదే అక్టోబర్ 9న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య నటించిన ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘అక్క’పై కూడా ఆసక్తి నెలకొంది. 1980ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మొత్తంగా అక్టోబర్ నెలలో ఓటీటీ ప్రేక్షకులకు విభిన్న జానర్లలో మంచి కంటెంట్ అందుబాటులోకి రానుంది.

 

 

[OTT Movies October 2026, October OTT Releases, OTT Movies, Telugu OTT Releases, Sardar 2 OTT, Romancham OTT, Akka Web Series, Netflix Movies, Amazon Prime Video, Telugu Movies OTT]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com