పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ మరోసారి తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకొని 14 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా ఆయన మాజీ భార్యగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి 14 ఏళ్ల వనవాసాన్ని గుర్తు చేసుకుంటూ.. శ్రీరాముడి వనవాసం కూడా ముగిసింది, మరి తన వనవాసం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
తెలుగు ప్రేక్షకులు తనను కేవలం పవన్ కల్యాణ్‌తో పరిచయం ఉన్న వ్యక్తిగానే చూస్తున్నారని రేణు దేశాయ్ అన్నారు. ‘బద్రి’ సినిమా కోసం 1999లో హైదరాబాద్‌కు వచ్చినప్పుడే తన జీవితం మొదలైందన్నట్లుగా కొందరు భావిస్తున్నారని, అంతకుముందు తనకంటూ ఓ జీవితం ఉందన్న విషయాన్ని మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన గతాన్ని, వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి కేవలం పవన్ కల్యాణ్‌తో ఉన్న సంబంధం ఆధారంగానే తనను గుర్తించడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ఈ వనవాసం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదని భావోద్వేగానికి గురయ్యారు.
2012లో పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తాను ఖాళీగా ఉండలేదని, ఎన్నో పనులు చేశానని రేణు దేశాయ్ గుర్తు చేశారు. విడాకుల అనంతరం ఓ మరాఠీ సినిమాను నిర్మించానని, అది మంచి విజయాన్ని సాధించిందని తెలిపారు. ఆ తర్వాత మరో సినిమాకు కథ రాయడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టానని వెల్లడించారు. డ్యాన్స్ షోలకు పనిచేశానని, కవితలు రాశానని, ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తున్నానని చెప్పారు. ఇన్ని పనులు చేస్తున్న తనను ఎవరూ గుర్తించడం లేదన్నట్లుగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు.
మరోవైపు సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్ గురించి కూడా రేణు దేశాయ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను జంతువులపై ప్రేమతో ఓ కుక్కను కాపాడినా కొందరు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ లేకపోతే తనకు జీవించే అర్హతే లేదన్నట్లుగా కొందరు కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వ్యక్తిగా తనకంటూ ఓ జీవితం, ఇష్టాలు, అభిరుచులు ఉన్నాయని.. వాటిని గుర్తించకుండా ప్రతి విషయాన్నీ పవన్ కల్యాణ్‌తో ముడిపెట్టి మాట్లాడటం బాధిస్తోందని పేర్కొన్నారు. విడాకుల తర్వాత కూడా ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: తొలి భారతీయ నటుడిగా విజయ్ సేతుపతి రికార్డు.!
ఇక రేణు దేశాయ్ సినీ ప్రయాణం విషయానికొస్తే.. తెలుగులోకి రాకముందు ముంబైలో మోడల్‌గా పనిచేశారు. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడంతో పాటు 30కి పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ‘బ్రీత్లెస్’ మ్యూజిక్ వీడియోతోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ సరసన ‘బద్రి’ (2000) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘జానీ’ (2003) చిత్రంలోనూ నటించారు. ‘జానీ’ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా కూడా పనిచేశారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్‌లకు ఇద్దరు పిల్లలు.. కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య. విడాకుల తర్వాత కూడా రేణు తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ, తన వృత్తిపరమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ (2023) సినిమాతో మళ్లీ తెలుగు తెరపై కనిపించారు. జంతు సంరక్షణ కోసం ఓ సంస్థను నిర్వహిస్తూ వీధి కుక్కలు, పిల్లులకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. ఇన్ని రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికీ తనను పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే చూడటంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మీకు నచ్చవచ్చు: డాక్టర్‌ను ఫ్లాట్‌కి పిలిచి దాడి.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్ వెనుక కథ.!
[Renu Desai, Renu Desai Emotional Comments, Renu Desai 14 Years Exile, Pawan Kalyan Ex Wife, Renu Desai Interview, Renu Desai Social Media Trolling, Renu Desai Divorce, Akira Nandan, Aadya, Renu Desai Latest News]






