Home

»

Latest News

ఛప్రి: స్లమ్‌ కుర్రాడి ప్రేమాయణం.. ఫస్ట్ లుక్‌తో ఇంప్రెస్ చేసిన సరోజ్ కుమార్.!

Nov 6, 2026 1:54PM

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. 

ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రలో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. 

BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు.. అతడి ప్రేమ ప్రయాణం.. ఆ జర్నీలో కొంత మంది డబ్బున్న వ్యక్తులు ఎదురు పడటం, వారి వల్ల అతని జీవితం తలకిందులు అవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్స్‌తో ‘ఛప్రి’ మూవీని తెరకెక్కించారు. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథలో చివరకు ఏం జరుగుతుంది? అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అతని ప్రేమలో విజయం సాధిస్తాడా? లేదా? అన్నది ‘ఛప్రి’ మూల కథ. 

ఇది కూడా చదవండి: హీరోయిన్‌గా కేజీఎఫ్‌ మదర్.. ఎమోషన్ నుంచి రొమాన్స్‌కి షిఫ్ట్.!

ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. ‘ఛప్రి’ ఫస్ట్ లుక్‌లో సరోజ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని గమనిస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో హీరో కనిపిస్తున్నారు.

తన మార్క్ రా స్టోరీలతో అలరించే సరోజ్ కుమార్.. ‘ఛప్రి’తో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
మహాకాళి 'అయిగిరి నందిని'  సాంగ్.. ఎనిమిది నిమిషాలు పూనకాలే.!
బాలయ్య ‘దాదా’ వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.!

 

 

 

[Chapri Movie First Look, Bandi Saroj Kumar, Chapri Movie, Chapri First Look, Mangalyaṁ, Parakramam, Nirbandham, Telugu Movies, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com